PM Modi: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 06న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే రోజు కొత్త ‘పంబన్ బ్రిడ్జ్’ని ప్రారంభిస్తారు. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. 1914లో నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది. Read Also: India On USCIRF: మైనారిటీలపై యూఎస్ […]
India On USCIRF: US కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) భారతదేశంలో మైనారిటీల పరిస్థితిపై మరోసారి తప్పుగా నివేదించింది. భారత్లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోందని పేర్కొంది. అయితే, ఈ నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. USCIRFని ‘‘ఆందోళన కలిగించే సంస్థ’’గా గుర్తించాలని భారత్ నొక్కి చెప్పింది.
USCIRF: భారతదేశంలో మైనారిటీల స్వేచ్ఛపై మరోసారి యూఎస్ అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ (USCIRF) తప్పుడు ప్రచారం చేసింది. మంగళవారం తన నివేదికలో భారత్, వియత్నాం దేశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సిక్కు వేర్పాటువాదుల కుట్రల్లో పాల్గొన్న భారతీయ గూఢచార సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్(RAW)పై ఆంక్షలు విధించాలని సూచించింది.
Ajey-The Untold Story of a Yogi: మన దేశంలో పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారుల జీవిత నేపథ్యం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. మరో రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమా తెరకెక్కింది. ఉత్తర్ ప్రదేశ్ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ‘‘అజయ్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’’ అనే టైటిల్ తో సినిమా రూపొందించేందుకు రంగం సిద్ధమైంది.
Yogi Adityanath: మసీదులు, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి బీజేపీ చేస్తున్న పనులపై ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. వక్ఫ్ పేరుతో వారు ఎంత భూమిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు..? వారు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..? అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల్ని వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేశారని, కొన్ని ఆస్తుల్ని వేరే వ్యక్తులకు విక్రయించడంతో ఇది వివాదానికి దారి తీస్తోందని అన్నారు.
India US Trade: డొనాల్డ్ ట్రంప్ ‘‘సుంకాల’’ దెబ్బకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచారు. ఏప్రిల్ నుంచి ‘‘పరస్పర సుంకాలు’’ అమలు చేస్తామని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాల తగ్గింపు, వాణిజ్యంపై భారత్, అమెరికా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా ఉత్పత్తులైన హర్లే-డేవిడ్సన్ బైక్స్, బోర్సన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తు్న్నట్లు తెలుస్తోంది.
Congress: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ‘‘నిందించే వ్యాఖ్యలు’’ చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ‘‘సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం’’ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ నోటీసుల్ని సభలో ప్రవేశపెట్టారు.
Mammootty-Mohanlal: మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ వివాదం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మోహన్లాల్ మమ్ముట్టి తరుపున శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో పూజ చేయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముస్లిం అయిన మమ్ముట్టి (అసలు పేరు మహ్మద్ కుట్టి) పేరుతో ఎలా పూజ చేయిస్తారని ఆయన వర్గానికి చెందిన కొందరు విమర్శిస్తున్నారు. మమ్ముట్టి పేరులో పూజ నిర్వహించిన రసీదు బయటకు రావడంతో ఒక్కసారి ఇది కేరళలో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రసీదు వైరల్గా మారింది.
Illicit affair: ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేని ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. హర్యానాలోని రోహ్తక్లోని వ్యక్తిని తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, ఆపై పొలంలో 7 అడుగుల గొయ్యి తీసి సజీవంగా పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. యోగా గురువుగా ఉన్న వ్యక్తి హత్య గతేడాది డిసెంబర్లో జరిగింది. అయితే, పోలీసులు సుదీర్ఘ దర్యాప్తు తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి, సోమవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Supreme Court: ఇటీవల పోక్సో కేసు విచారణ సందర్భంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ‘‘వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారాలు తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఈ చర్యల్ని తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణిస్తామని చెప్పింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలపై మహిళలతో పాటు సమాజం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.