MK Stalin: తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు చిగురించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ భేటీపై సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న సమయంలో అసెంబ్లీలో లేకపోవడాన్ని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లు ముస్లింల హక్కుల్ని హరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: UP Bans Meat Sale: రామ నవమి సందర్భంగా ఆలయాల వద్ద మాంసం అమ్మకాలు నిషేధం..
ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు ముస్లింలు మాత్రమే కాదు, భారతదేశం అంతటా ఉన్న ముస్లింలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు చేసిన తీర్మానాన్ని స్వాగతించారని స్టాలిన్ అన్నారు. అయితే, ఇలాంటి కీలక తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సమయంలో పళని స్వామి గైర్హాజరు కావడంపై ఆయన ఆరోపణలు చేశారు. ‘‘ఎందుకు హాజరు కాలేదో అందరికి తెలుసు. తెల్లవారుజామున ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, అతను ఢిల్లీ విమానం ఎక్కడా. స్కామ్‌లో ఇరుక్కున్న వ్యక్తిలాగా ఆయన అమిత్ షాని కలవడానికి నాలుగు కార్లు మార్చారు’’ అని స్టాలిన్ అన్నారు.
అసెంబ్లీ సమావేశం సమయంలో అన్నాడీఎంకే నేతలు గందరగోళంలో, పిచ్చి చూపులు చూసుకున్నారని, పళని స్వామి లేనప్పుడు పిచ్చిగా ఫోన్ కాల్స్ చేయడానికి బయటకు వెళ్లారని స్టాలిన్ ఆరోపించారు. పళని స్వామిని ఎగతాళి చేస్తూ.. ఆయన అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని చెబుతున్నారని, అయితే వారు ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమవుతారని అన్నారు.