Guru Gochar 2025: జ్యోతిష్యంలో గురు గ్రహానికి ఉన్న ప్రాధాన్యత మరే గ్రహానికి ఉండదు. కొన్ని గ్రహాలు సరైన స్థానంలో లేకున్నా, గురు గ్రహం వ్యక్తి జాతకంలో మంచి స్థానంలో ఉంటే వాటి నుంచి ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తప్పించుకోగలడు. దేవతల గురువుగా చెప్పబడే గుర గ్రహం జ్యోతిష్య శాస్త్రంలో జ్ఞానానికి, సంపద, అదృష్టం, వివాహం, దేవుడి దృష్టి వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తాడు.
ఈ ఏడాది మే 14న వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. దాదాపుగా ఏడాది కాలం పాటు ఈ భావంలోనే సంచరిస్తుంటారు. బుధ స్థానంలో గురువు గ్రహం సంచరించడం యోగదాయకమని పండితులు చెబుతున్నారు.
మిథునం: మిథున రాశిలోకే గురువు ప్రవేశించిన తర్వాత వీరికి అదృష్టం పట్టబోతోంది. రాశిలోకే వస్తుండటంతో ఈ రాశికి అద్భుతమైన కీర్తి సంపదలు సిద్ధిస్తాయి. గురువు మిథునం నుంచి తన 5వ, 7వ, 9వ భావాలను చూస్తుండటంతో ఆయా స్థానాలు కూడా యాక్టివేట్ అవుతాయి. 9వ చూపుతో శని ఆధిపత్యం ఉండే రాశిని చూస్తుండటంతో ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. వివాహాది శుభకార్యాలకు ఆస్కారం ఉంది.
సింహ రాశి: సింహ రాశి వారికి 11వ స్థానంలోకి గురువు ఉంటున్నారు. జ్యోతిష్యంలో 11వ స్థానాన్ని లాభ స్థానంగా భావిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సింహ రాశి వారికి అధికమైన లాభాలను గురువు కురిపిస్తారు. ఉద్యోగంలో పదోన్నతలు సిద్ధిస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. మీకు గుర్తింపు, ఉన్నత స్థాయి దక్కుతుంది.
Read Also: Shani Gochar 2025: శని గ్రహం వల్ల ఈ రాశులకు వారికి అదృష్టయోగం..
తులా రాశి: వృషభం నుంచి మిథునంలోకి గురువు మారడంతో తులా రాశి వారికి అదృష్టయోగం పట్టబోతోంది. గురువు తులా రాశికి 9వ స్థానంలో ఉంటారు. దీనిని భాగ్య స్థానంగా జ్యోతిష్యంలో చెబుతారు. ఇదే విధంగా గురువు తన 5వ దృష్టితో నేరుగా రాశిని చూస్తుండటం కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మాతృవర్గరీత్యా బాగుంటుంది. రుణాలు తీరిపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుగా ఉంటుంది. దైవ కార్యాలపై ఆసక్తి, ఆలయాల సందర్శన. విదేశీయానం, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.
ధనస్సు: గురువు గ్రహం నేరుగా మిథున స్థానం నుంచి సప్తమ దృష్టితో చూస్తున్నారు. దీని వల్ల సంతాన ప్రాప్తి, వివాహయోగం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. అవమానాలు, అపనిందలు తొలుగుతాయి. ధను రాశి నుంచి 7వ స్థానంలో గురువు ఉండటంతో మంచి వివాహ స్థితి ఉంటుంది.
కుంభ రాశి: కుంభరాశి నుంచి గురువు 5వ స్థానంలో ఉన్నారు. గురువు నవమ దృష్టితో నేరుగా కుంభ రాశిని చూస్తున్నారు. ధన స్థానంలో శుభగ్రహం ఉండటంతో ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. సంతాన పరంగా ఈ స్థితి బాగుంది. గురువు అనేక విధాలుగా ఉన్నత స్థితికి తీసుకెళ్తారు