Ugadi Rasi phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. ఉగాది పర్వదినాన ప్రతీ ఒక్కరు కూడా తమ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఈ ఏడాది గ్రహ పరిస్థితులు కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, ఉద్యోగం రావడం, ప్రమోషన్లు రావడం వంటివి జరగబోతున్నాయి.
వృషభ రాశి: ఆదాయం -11, వ్యయం – 5, రాజ్యపూజ్యం-01, అవమానం-3
నక్షత్రాలు- కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి(1,2,3,4) , మృగశిర 1,2 పాదాలు
2025లో రాజయోగం పట్టే రాశుల్లో వృషభరాశి మొదటి స్థానంలో ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్న రాశుల్లో ఈ రాశి ఒకటి. ఈ ఏడాది వీరికి కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. గురువు, రాహువు, శని అనుకూలంగా ఉన్నారు. వృషభ రాశిలోనే గురువు ఉండటంతో చాలా మంచిది.
* అదే విధంగా మే నెలలో ద్వితీయ స్థానంలోకి గురువు మారుతుండటం కూడా చాలా చక్కగా ఫలితాలను ఇస్తుంది. సంతానం, శుభకార్యాలకు మంచి సమయంగా చెప్పబడుతుంది. అక్టోబర్ 19 వచ్చే సమయానికి తృతీయ స్థానంకు వెళ్లడం కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. గురుగ్రహానికి పరిహారాలు చేసుకోవడం వల్ల దీన్ని అధిగమించవచ్చు.
* లాభ స్థానమైన 11వ స్థానంలో 5 గ్రహాలు ఉంటడం వృషభ రాశికి యోగిస్తుందని చెబుతున్నారు. ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, సంతానం, భార్యభర్తల అనుబంధ రీత్యా బాగుంటుందని చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరాంతం వరకు శని లాభస్థానంలో ఉండటం కూడా కలిసి వస్తుంది.
* రాహువు స్థితి మే 20న దశమ స్థానంలోకి వస్తుంది. కేతువు చతుర్థ స్థానంలోకి వస్తుంది. ఇది అంతగా యోగించే స్థానాలు కాదని చెబుతున్నారు. అయినప్పటికీ, గురుగ్రహ బలం వల్ల వీటిని అధిగమించవచ్చని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: ఆదాయం -14, వ్యయం -2, రాజ్యపూజ్యం 4, అవమానం-3
(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర(1,2,3,4), పునర్వసు 1,2,3)
* మిథున రాశి వారు ఇప్పటివరకు పడిన ఇబ్బందులు ఈ విశ్వావసు నామ సంవత్సరం కలిసి వస్తుందని చెబుతున్నారు. గురువు రాశిలోకి రావడం ఈ రాశికి యోగిస్తుంది. రాహువు 9వ స్థానంలోకి, కేతువు మూడో స్థానంలోకి వస్తున్నాయి. కేతువు తృతీయ స్థానం చాలా చక్కగా యోగిస్తుంది. శని 10 స్థానంలో పెద్దగా ఇబ్బందులు పెట్టడని చెబుతున్నారు.
* రాశిలో గురువు వల్ల, ఇప్పటి వరకు వీరు కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. గురు గ్రహం అతిచారం వల్ల ఈ రాశి వారికి ద్వితీయ స్థానమైన కర్కాటకంలోకి రావడం కూడా మంచిగా పనిచేస్తుంది. అనేక విధాలుగా వీరి సంపద పెరుగుతుంది. భార్యభర్తల అనుబంధం బాగుంటుంది. మిథున రాశి వారికి అన్నింట సంతోషం లభిస్తుంది.
కన్యా రాశి: ఆదాయం-14, వ్యయం-02, రాజ్యపూజ్యం-06, అవమానం-06
(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త(1,2,3,4), చిత్త 1,2 పాదాలు)
* ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు ఉండబోతున్న రాశుల్లో కన్యా రాశి ఒకటి. ఈ రాశి వారికి ప్రథమార్థం చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. సప్తమ భావంలో శని, గురువు 9,10 స్థానాల్లో యోగించబోతున్నారు. మే 20న 6వ స్థానంలోకి రాహువు రావడం వల్ల అత్యుత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. రాహువు వల్ల ధనం ఇవ్వడం, ఆర్థిక ఇబ్బందులు తొలగడం వంటివి జరుగుతాయి. శుభకార్యాలకు సంబంధించిన కార్యకలాపాల్లో కన్యా రాశి వారు పాల్గొంటారు.
తులా రాశి: ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యాలు 2, అవమానాలు 2
(చిత్త 3,4 పాదాలు, స్వాతి(1,2,3,4), విశాఖ 1,2,3 పాదాలు)
* ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు పొందబోతున్న రాశుల్లో తులారాశి కూడా ఉంది. గత కొంత కాలంగా తులారాశి వారు అనుభవిస్తున్న కష్టాలు విశ్వావసు నామ సంవత్సరంలో తొలిగిపోనున్నాయి.
* తులా రాశికి ఆరవ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వారికి యోగిస్తుంది. రుణాలు ఉంటే తీరిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. మే 15 నుంచి గురువు 9వ స్థానంలోకి రావడంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. పంచమంలో రాహువు ఫలితాలు సరిగా లేనప్పటికీ, గురుగ్రహం బలం ఉండటంతో ఇబ్బందులు తొలిగిపోతాయి. లాభ స్థానంలో కేతువు ఫలితాలు బాగుంటాయి.