Shani Gochar 2025: జ్యోతిష్యంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శనిని కర్మ కారకుడిగా భావిస్తారు. శని ఒక్కో ఇంట్లో రెండున్నర ఏళ్లు ఉంటారు. 2025లో శని కుంభం నుంచి మీనంలోకి మారుతున్నాడు. రెండున్నరేళ్ల పాటు ఇక్కడే శని సంచరిస్తారు. శని గ్రహం ప్రతీ మనిషిని కష్టపడేలా చేస్తాడు, మనల్ని పరీక్షిస్తుంటాడు. ఎవరు మనవారు, ఎవరు కాదు అనే విషయాలను శని యోగంలోనే తెలుసుకోగలము. అయితే, 2025లో మూడు గ్రహాలకు శని గ్రహ గోచారం యోగిస్తుంది.
1) కర్కాటక రాశి:
ఇన్నాళ్లు 8వ స్థానంలో ఉండీ శని గ్రహం ఈ రాశి వారికి తీవ్ర ఇబ్బందులు కలిగింది. అయితే, మార్చి 29 నుంచి శని కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది కర్కాటక రాశికి 9వ స్థానం అవుతుంది. దీంతో నవమ శని వ్యక్తులకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తారు. ఉన్నత స్థాయి ఫలితాలను ఇస్తారు. విద్య, వ్యాపారంతో సహా అన్ని రంగాల వారికి అత్యద్భుతమైన ఫలితాలను కలిగిస్తారు. ఉన్నత స్థానాన్ని సంప్రదిస్తారు. ఉన్నత పదవులు దక్కుతాయి. ధన, గృహ, ఆర్థిక లాభాలతో పాటు వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి.
2) వృశ్చిక రాశి:
అర్థాష్టమ శని వృశ్చిక రాశి వారికి తొలగిపోతుంది. పంచమ స్థానంలోకి వెళ్తుండటంతో ఈ రాశి వారు ఊపిరి పీల్చుకోబోతున్నారు. ఇన్నాళ్లు శని తన 10 దృష్టితో నేరుగా రాశిని చూడటం వల్ల కష్టాలను ఎదుర్కొన్నారు. మార్చి 29 నుంచి మీనంలోకి శని ప్రవేశించడంతో అన్ని సుఖాలు కలుగబోతున్నాయి. సంతానపరంగా అనుకూలమైన కాలంగా ఉంటుంది. శని వల్ల రెండున్నరేళ్ల కాలం అఖండ భోగభాగ్యాలు కలుగుతాయి.
3) మకర రాశి:
ఏలినాటి శని మకరరాశి ముగిసింది. 7.5 ఏళ్లు పాటు శని వీరిని పరీక్షించారు. ఇన్నాళ్లు రెండో స్థానంలో ఉన్న శని, ఇప్పుడు మూడోస్థానం అంటే విక్రమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. శని వెళ్తూ, వెళ్తూ వారికి ఏదో మంచి చేసే వెళ్తాడు. మకర రాశి వారికి వచ్చే రెండున్నరేళ్లు అద్భుతమై కాలం ఉంది. ఉత్సాహం, ఆనందంతో పని చేయగలుగుతారు. అన్నదమ్ములతో సంబంధాలు బాగుంటాయి. ఇప్పుడు ఉన్న స్థితితో పోలిస్తే మంచి ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.