Porn Racket: నోయిడాలో భార్యభర్తలు నడిపిస్తున్న ‘‘పోర్న్ రాకెట్’’ బట్టబయలైంది. అంతర్జాతీయంగా ఈ రాకెట్‌కి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ ఇద్దరు గత 5 ఏళ్లుగా ఈ రాకెట్ నడుపుతున్నారు. భారీగా విదేశీ నిధులతో ఈ రాకెట్‌కి సంబంధాలు ఉన్నాయి. ఈ జంట సైప్రస్‌కి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇది Xhamster, Stripchat వంటి పాపులర్ అడాల్ట్ ఎంటర్‌టైన్మెంట్ వెబ్‌సైట్లను నిర్వహిస్తుంటుంది. ఈ జంట పర్పస్ కోడ్‌లను తప్పుగా చూపించి, ప్రకటనలు, మార్కెట్ రీసెర్చ్ కోసం ఫారెన్ కంపెనీలకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ జంట నోయిడా ఇంటిపై దాడి చేసి రూ. 15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని కనుగొన్నారు. దర్యాప్తులో, ప్రధాన నిందితుడు ఉజ్వల్ కిషోర్ గతంలో రష్యాలో ఇలాంటి రాకెట్లో పాల్గొన్నట్లు తేలింది. భారతదేశానికి మకాం మార్చిన తర్వాత ఇక్కడ కూడా ఇదే పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్, ప్రధానంగా ఫేస్‌బుక్ ఉపయగించి మోడల్‌లను నియమించుకుంటారు. మంచి జీతాలు ఇస్తామనే హామీలతో మోడలింగ్ అవకాశాలు అందిస్తామని ‘‘ఎచాటో డాట్ కామ్’’ అనే పేజీని క్రియేట్ చేశారు.
Read Also: Swati Sachdeva: తల్లిపై జోకు వేయడంతో వివాదంలో స్టాండ్-అప్ కమెడియన్..
ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా వీరి వలలో చిక్కారు. ఆడిషన్ల కోసం నోయిడాలోని ఆ జంట ప్లాట్‌కు వచ్చిన తర్వాత, వీరికి పోర్న్ రాకెట్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. నెలకు రూ. 1 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు జీతాన్ని ఇచ్చారు. అధికారులు దాడి చేసిన సమయంలో, ఈ జంట ఉంటున్న ఫ్లాట్‌లో ఒక ప్రొఫెషనల్ వెబ్ క్యామ్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అడాల్ట్ కంటెంట్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి.
సమాచారం ప్రకారం, మోడల్స్ కస్టమర్లు చెల్లింపు ఆధారంగా హాఫ్ ఫేస్ షోలు, ఫుల్ ఫేస్ షోలు, పూర్తిగా న్యూడ్‌గా ఉండే వివిధ కేటగిరీలుగా వర్గీకరించారు. ఈ సర్వీసుల్ని యాక్సెస్ చేయడానికి కస్టమర్లు ముందుగా టోకెన్ కొనుగోలు చేయాలి. ఈ ఆదాయంలో 75 శాతం సదరు భార్యభర్తలకు వెళ్లగా, 25 శాతం మోడళ్లకు వెళ్తుంది. ప్రారంభంలో వీరు క్రిప్టో కరెన్సీ ద్వారా కస్టమర్ల నుంచి చెల్లింపులను అందుకున్నారు. టెక్నియస్ లిమిటెడ్ ద్వారా రూ. 7 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసిన నెదర్లాండ్ లోని ఒక బ్యాంక్ అకౌంట్‌ని ఈడీ కనుగొంది. ఈ నిధులను భారతదేశంలో ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు ఉపయోగించి విత్ డ్రా చేసుకున్నారు. ఈ రాకెట్‌లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.