Thane: క్యాన్సర్ పేషెంట్ అని చూడకుండా 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని మహారాష్ట్ర థానే పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం తెలిపారు. 29 ఏళ్ల నిందితుడిని బీహార్ నుంచి అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. బీహార్‌లో బాలిక కుటుంబం ఉన్న అదే గ్రామానికి చెందిన నిందితుడు రెండు నెలల క్రితం బద్లాపూర్‌లో వారి కోసం ఒక అద్దె వసతిని ఏర్పాటు చేశాడు. బాలిక చికిత్సకు సాయం చేశాడు.
Read Also: USA: ట్రంప్ భయం.. సూపర్ మార్కెట్లకు అమెరికన్ల పరుగు.. వేటిని ఎక్కువగా కొంటున్నారంటే..?
అయితే, బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు, సదరు వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మూడుసార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఏసీపీ శైలేష్ కాలే తెలిపారు. ముంబైలో ఒక ఆస్పత్రిలో చిన్నారికి కీమోథెరపీ చేయించుకుంటోంది. అయితే, రొటీన్‌గా జరిగే పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. విచారణలో నిందితుడి గురించిన వివరాలు బయటకు వచ్చాయి.
బాధితురాలి కుటుంబం బద్లాపూర్‌లో ఉండేలా ఏర్పాట్లు చేసిన నిందితుడు, ఆమె చికిత్సకు సాయం చేస్తున్నాడు. ఆ సమయంలోనే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె గర్భవతి అయింది’’ అని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ బల్వాడ్కర్ అన్నారు. నిందితుడిపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.