Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2025 పార్లమెంట్‌లో పాస్ అయింది. కాంగ్రెస్, ఎస్పీ వంటి ఇండీ కూటమి పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. అయినప్పటికీ బీజేపీ కూటమికి సంఖ్యా బలం ఉండటంతో బిల్లు రెండు సభల్లో సులభంగా నెగ్గింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మొహహ్మద్ జావెద్ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వక్ఫ్ బిల్లు వివక్షత, ముస్లిం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. హిందూ, జైన్, సిక్కు మతపరమైన దాతృత్వ దానాలకు వర్తించే చట్టపరమైన రక్షణల నుంచి వక్ఫ్‌ని తొలగిస్తుందని ఆయన పిటిషన్‌లో వాదించారు. ఇది ముస్లింలపై శత్రు వివక్షకు సమానమని, మతం ఆధారంగా వివక్ష నిషేధించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15లను ఉల్లంఘిస్తుందని పేర్కొంది.
ఈ సవరణ వక్ఫ్‌ల నుంచి రక్షణలను తొలగిస్తుంది. అదే సమయంలో వాటిని ఇతర మతపరమైన నిధుల కోసం నిలుపుకుంటుంది అని పిటిషన్ పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ‘‘క్వివైవ్‌పై సెంటినెల్’’ వ్యవహరించాలని సుప్రీంకోర్టుని కోరుతూ.. మైనారిటీలపై మెజారిటీ నిరంకుశత్వం నుంచి రక్షించడటం, రాజ్యాంగంలోని పార్ట్-3 కింద మంజూరు చేయబడిని హక్కులను కాపాడటం న్యాయవ్యవస్థ రాజ్యాంగ విధి అని పిటిషన్ పేర్కొంది. లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓవైపీ ఈ బిల్లును ముస్లింల విశ్వాసం, మతపరమైన ఆచారాలపై దాడిగా అభివర్ణించారు. లోక్‌సభలోనే వక్ఫ్ బిల్లు ప్రతులను చింపేవారు. తన చర్యను మహాత్మా గాంధీ అన్యాయమైన చట్టాలను ధిక్కరించడంతో పోల్చుకున్నారు.