Bengal Waqf Clashes: బెంగాల్ వక్ఫ్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో భారీగా అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. చాలా మంది హిందువులు ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు హింసలో పాల్గొన్న వారిలో 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, హింసాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లను అదుపు చేయడంలో మమతా బెనర్జీ సర్కార్ దారుణంగా విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెలుగులోకి తెస్తున్న విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బెంగాల్‌లో గతంలో దాడులకు పాల్పడిన ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ ‘‘జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB)’’ బలపడుతుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మదర్సాల నుంచి యువకులను రిక్రూట్ చేసుకోవడానికి రాష్ట్రంలోని 7 సరిహద్దు జిల్లాల్లో మాడ్యుల్‌లను యాక్టివ్ చేస్తున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఉగ్రవాదానికి ప్రవేశమార్గంగా ఉన్నాయి. ఈ సంఘ విద్రోహ శక్తులు ముర్షిదాబాద్, మాల్డాలో తిరిగి సమావేశమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరు 2019లో సీఏఏ వ్యతిరేక అల్లర్లలో ఉపయోగించిన వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది సమన్వయంతో కూడిని ఇస్లామిస్ట్ ఎజెండా గురించి భయాలు పెంచుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జేఎంబీ గుర్తింపు లేని మదర్సాల నుంచి తీవ్రవాదం చేస్తోందని, సరిహద్దు శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారని చెప్పింది.
Read Also: Manchu Lakshmi : మనోజ్ ను పట్టుకుని ఏడ్చేసిన మంచులక్ష్మీ..
బెంగాల్ హింసపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్..
ఇంటెలిజెన్స్ వర్గాలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అత్యవసర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, శాంతిభద్రతల పరిస్థితి దిగాజారుతున్నాయని, రాష్ట్ర పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)తో కలిసి మతఘర్షణల్ని విస్మరిస్తున్నాయని ఆరోపించింది. నిరసనల సమయంలో హిందువుల ఆస్తులపై దాడులు చేయడం, మతపరమైన భావాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం వల్ల బంగ్లాదేశ్ సరిహద్దులోని రాష్ట్రం అస్థిరమవుతోందని నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
పోలీసులు కనీస బలగాలను మాత్రమే ఉపయోగించారని, ఇది ఉద్దేశపూర్వకంగా నిష్క్రియాత్మకంగా వ్యవహరించారనే ఆరోపణలకు ఆజ్యం పోసింది. చివరకు కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న 30 శాతం ముస్లిం ఓటర్లు కోసం అధికార టీఎంసీ సున్నితంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. బెంగాల్‌తో మతపరమైన నిరసనల్ని అదుపు చేయకపోతే అవి సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచుతాయని, భారత సరిహద్దు రాష్ట్రాన్ని అస్థిర పరుస్తాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.