Shocking News: ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని ఎటావాలో ఆస్తి వివాదంలో, డీలర్ అతడి భాగస్వామి కలిసి ఆమెను హత్య చేశారు. నిందితులు శివేంద్ర యాదవ్(26), అతడి సహాయకుడు గౌరవ్(19)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గురైన బాధితురాలని 25 ఏళ్ల అంజలిగా గుర్తించారు.
Bengal Waqf Violence: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. నిరసనల పేరుతో హిందువుల ఇళ్లను, ఆస్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారుల్ని కోరినప్పటికీ సమస్య సద్దుమణగడం లేదు. వక్ఫ్ బిల్లును రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ఆందోళనకారులకు చెప్పారు. అయినప్పటికీ, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘వక్ఫ్ బిల్లును మా పార్టీ వ్యతిరేకించింది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకోండి’’ […]
Ukraine War: ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఫార్మాసూటికల్ కంపెనీ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ విసయాన్ని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. రష్యా "ఉద్దేశపూర్వకంగా" ఉక్రెయిన్‌లోని భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది.
Pune: పూణేలోని హండేవాడి ప్రాంతంలో ఆడ కుక్కపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌కి చెందిన అలీముద్దీన్ అమినల్ షేక్‌గా గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మార్చి 26న జరిగింది. ఈ విషయానికి సంబంధించి కుక్క యజమాని చంద్రశేఖర్ యాదవ్ కలేపడల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా షేక్‌ని అరెస్ట్ చేశారు.
Father Suicide: కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా కూతురు పెళ్లి చేసుకున్న కారణంగా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. 49 ఏళ్ల మెడికల్ స్టోర్ యజమాని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రిషిరాజ్ అలియాస్ సంజూ జైస్వాల్గా గుర్తించిన ఆ వ్యక్తి తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుున్నాడు.
Bengal Waqf Violence: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో హింస పెరిగింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిరసనకారులు ఇద్దరు తండ్రికొడుకులను నరికి చంపారు. ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షిదాబాద్‌లో శుక్రవారం జరిగిన హింసాకాండకు సంబంధించి 118 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాను ఇచ్చిన వాగ్దానాన్ని నేరవేర్చారు. ఒకప్పుడు దు:ఖంతో నిండి ఉన్న ఆ ఇళ్లు, ఇప్పుడు సంతోషంగా ఉంది. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ హేమ రాజ్ మీనా కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. ఆరేళ్ల క్రితం జరిగిన దాడి సమయంలో, దు:ఖంలో ఉన్న హేమరాజ్ భార్యని ఓదారుస్తూ, ఆమెకు కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు.
Amit Shah: ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతీ భారతీయుడికి బోధించాలని, ప్రతీ తల్లి తన బిడ్డకు చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ప్రతీ భారతీయుడికి మాతృభూమికి సేవ చేయడం, సుపరిపాలనలో ఆదర్శవంతమైన మరాఠా సామ్రాజ్య స్థాపకుడి గురించి చెప్పాలని కోరారు.
Allahabad High Court: అరెస్ట్ చేయడానికి గత కారణాలను నిందితులకు సరిగా తెలియజేయాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాన్ని తెలియజేయడం తప్పనిసరి అవసరం అవసరమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. చట్టబద్ధమైన పరిమితులు ఉన్నప్పటికీ, కారణాలు తెలియజేయకపోతే బెయిల్ మంజూరు చేయడానికి ఒక కారణం అవుతుందని కోర్టు తీర్పు చెప్పింది.
Crime: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో హృదయ విదారక సంఘటన జరిగింది. పిల్లల ముందే ఓ కసాయి భర్త తన భార్యను కొట్టి చంపాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింగా గ్రామంలో ఈ దారుణం జరిగినట్లు శనివారం పోలీసులు తెలిపారు.