Tarun Chugh: జిన్నా చేసిందే, ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తుంది..
- బెంగాల్‌లో వక్ఫ్ పేరిట తీవ్ర హింస..
- ఇప్పటికే ముగ్గురు మృతి, 150 మంది అరెస్ట్..
- మమతా బెనర్జీ జిన్నాగా మారింది: తరుణ్ చుగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarun Chugh: బెంగాల్‌లో వక్ఫ్ వ్యతిరేక అల్లర్లపై మమతా బెనర్జీ ఏం చేయడం లేదని ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. హింసకు మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలే కారణమని ఆరోపిస్తోంది. బెంగాల్‌లో ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో జరిగిన వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింస చోటు చేసుకుంది. ఈ అల్లర్ల లో ఇప్పటికే ముగ్గురు మరణించారు. అల్లర్లకు పాల్పడిన వారిలో 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, కలకత్తా హైకోర్టు ప్రభుత్వం తీరును తీవ్రంగా ఆక్షేపించింది, కళ్లు మూసుకుని ఉండలేమని, హింస తీవ్రంగా ఉన్న జంగీపూర్ ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Old City Metro : ఓల్డ్ సిటీలో మెట్రో కారిడార్‌లో జోరు.. స్థల సేకరణ పనులు ముమ్మరం
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ తీరుపై బీజేపీ నేత తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జిన్నా చేస్తున్నది ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తుంది. నేడు ఆమె ఇమేజ్ జిన్నాకు సమానంగా ఉంది. ఆమె పార్టీ ముస్లిం లీగ్ చేసిన పనినే చేస్తోంది. నేడు జరుగుతున్న సంఘటనలు 1940లో ముస్లింలీగ్ చర్యల లాంటివి. అయినప్పటికీ, అధికారంలో ఉన్న వ్యక్తులు తమ కళ్లకు గంతలు కట్టుకున్నారు. ముర్షిదాబాద్ లో వక్ఫ్ హింసలో ముగ్గురు వ్యక్తులు మరణించిన తర్వాత కూడా మమతా బెనర్జీ రహస్యంగా మౌనం వహించడం సిగ్గుచేటు, తీవ్రంగా ఖండించదగింది, బాధకరమైనవి. మైనారిటీ సంతృప్తి పేరుతో మమతా ప్రభుత్వం హిందువుల భద్రతపై నిరంతరం రాజీ పడుతోంది.’’ అని తరుణ్ చుగ్ అన్నారు.
#WATCH | Delhi: On Murshidabad violence, BJP leader Tarun Chugh says, "What Jinnah was doing is being done by Mamata Banerjee. Today, her image has been established as a modern Jinnah and her party is doing the work of the Muslim League…Today's incidents are like the actions of… pic.twitter.com/Mat300TVrD
— ANI (@ANI) April 13, 2025
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!