BJP: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్‌ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మోడీని ‘‘సంఘీ’’ అంటూనే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉగ్రవాదులు అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పాట్నా పోలీసుల్ని బీజేపీ కోరింది.
Read Also: Bengal Violence: ముర్షిదాబాద్ సహా బెంగాల్ 4 జిల్లాల్లో AFSPA చట్టాన్ని విధించాలి..
‘‘తుక్డే-తుక్డే గ్యాంగ్’లో భాగమైన కన్హయ్య కుమార్ ఏప్రిల్ 11న ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మరియు RSS మరియు దాని సిద్ధాంతాలపై దుర్వినియోగ భాషను ఉపయోగించాడు. ఇంటర్వ్యూలో అతను ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకరమైనది మరియు ఆమోదయోగ్యం కాదు’’ అని ఇక్బాల్ అన్నారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇక్బాల్ కోరాడు.
ప్రజల మనోభావాలను రెచ్చగట్టడం, అశాంతిని ప్రేరేపించడం అతడి ఉద్దేశమని ఇక్బాల్ అన్నారు. జెఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి కీలకంగా ఉన్నారు. అతడిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం మాకు ఉందని ఇక్బాల్ చెప్పారు.