Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆదివారం సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 21 మంది మరణించగా, 83 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. ఈ ఏడాది ఉక్రెయిన్‌లో జరిగిన భయంకరమైన దాడుల్లో ఇది ఒకటి. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ఖండించారు. రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
‘‘కేవలం దుష్టులు మాత్రమే ఇలా ప్రవర్తించగలరు. సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తున్నారు’’ అని ఆయన సోషల్ మీడియాలో రాశారు. దాడిలో నేలపై పడి ఉన్న శవాలు, దెబ్బతిన్న బస్సులు, కార్లను చూపించే ఫోటోలను పోస్ట్ చేశారు. దాడి జరిగినప్పుడు బాధితులు వీధిలో, వాహనాల్లో, భవనాల్లో ఉన్నట్లు అంతర్గత మంత్రి చెప్పారు. ముఖ్యమైన చర్చి పండగ రోజున ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది.
ఉక్రెయిన్ సెంటర్ ఫర్ కౌంటర్ డిసైన్ఫర్మేషన్‌ను నిర్వహిస్తున్న భద్రతా అధికారి ఆండ్రీ కోవెలెంకో, అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోను సందర్శించిన తర్వాత ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్ శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి వెట్‌కాఫ్ శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశయ్యారు.
ఆదివారం రష్యా దాడి తర్వాత జెలెన్స్కీ దీనిని ఉగ్రవాదంగా అభివర్ణించారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, యూరప్ కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రష్యా సరిగ్గా ఇలాంటి ఉగ్రవాదాన్ని కోరుకుంటోందని, యుద్ధాన్ని పెంచుతోందని, దురాక్రమణదారుడిపై ఒత్తిడి లేకుండా, శాంతి అసాధ్యమని జెలెన్స్కీ అన్నారు. చర్యలు ఎప్పుడు బాలిస్టిక్ క్షిపణి దాడుల్ని, వైమానికి బాంబులను ఆపలేవని చెప్పాడు.
రష్యా ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించింది. ప్రస్తుతం తూర్పు, దక్షిణ ప్రాంతాలలో దేశంలోని 20 శాతాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ దాడికి ముందు, రష్యా తమ ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ దాడి చేసిందని ఆరోపించింది. ఇది అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఉక్రెయిన్, రష్యా గత నెలలో ఒకరి ఇంధన సౌకర్యాలపై మరొకరు దాడులను నిలిపివేయడానికి అంగీకరించాయి. ఇప్పుడు ఇరు పక్షాలు తాత్కాలిక నిషేధాన్ని ఉల్లంఘించాయి.
https://twitter.com/ZelenskyyUa/status/1911340183800205684