Pakiatan: దాయాది పాకిస్తాన్‌ని ఓ వైపు బలూచిస్తాన్ లో బలూచ్ లిజరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ) దెబ్బ కొడుతున్న పట్టడం లేదు. భారత్‌ని కవ్విస్తూ యుద్ధోన్మాదంతో ప్రవర్తిస్తోంది. ఇప్పటికే, బీఎల్ఏ పాక్ సైనికుల్ని ఊచకోత కోస్తున్నారు. బలూచిస్తాన్‌లో ఉరికించి కొడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా పాక్ తాలిబాన్లు 30 మంది పాక్ సైనికులను చంపినట్లు శుక్రవారం రాత్రి పేర్కొంది.
IMF: భారత అభ్యంతరాలను పట్టించుకోకుండా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కి 1 బిలియన్ డాలర్లు రుణాన్ని మంజూరు చేసింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(EFF) కింద బెయిలౌట్ ప్యాకేజీని అందించినట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది.
Pak Drone Attack: పాకిస్తాన్ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాక్ పౌర విమానాలను రక్షణగా ఉంచుకుని భారత్‌పై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. వరసగా రెండో రోజు కూడా పాకిస్తాన్ భారత నగరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు (IB),నియంత్రణ రేఖ (LOC)లను దాటి దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలనున భారత సైన్యం భగ్నం చేసింది.
Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. తాజాగా, ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. త్వరగా సమస్య ముగియాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు.. భారత్, […]
Pak drone attacks: వరసగా రెండో రోజు దాయాది పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేశాయి. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి, సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా 26 నగరాలను లక్ష్యంగా చేసుకుని తాజా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
IMF meeting: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కి అందించే బెయిలౌట్ ప్యాకేజీని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో పాకిస్తాన్‌కి ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని, భారత్ తన ఆందోళనను వ్యక్త పరిచింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఐఎంఎఫ్ నిధులను దుర్వినియోగం చేస్తుందని చెప్పింది. పాకిస్తాన్ భారీ రుణభారం, ఆర్థిక వ్యవస్థల్లో పాక్ ఆర్మీ జోక్యాన్ని భారత్ ఐఎంఎఫ్ ముందు లేవనెత్తింది. ప్రపంచ ఆర్థిక విధానాలలో నైతిక పరిశీలనల అవసరాన్ని భారతదేశం నొక్కి చెప్పింది.
India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.
India Pak War: పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలను, వాటి శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100కు మించి ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం, పాక్ భారత్‌పై దాడికి పాల్పడింది. దీని తర్వాత మరోసారి ఇండియా
Nawaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం సాయంత్ర పాకిస్తాన్ వందలాది డ్రోన్లతో, క్షిపణులతో భారత్‌పై అటాక్ చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ తరహా పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి, ఆయన సోదరుడు, మాజీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడానికి దౌత్యపరమైన విధానం అవసరమని సలహా ఇచ్చినట్లు దిఎక్స్‌ప్రెస్ […]
Indian forces: భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారామిలిటరీ దళాలు ఉంటాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రతా దళం (BSF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) దళాలు సరిహద్దు రక్షణ దళాలుగా పనిచేస్తాయి. ఇవి మనదేశంలోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తాయి. వీటిలో పాటు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ […]