Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- పాఠశాలలో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం
- ఉపాధ్యాయుడు మృతి
- కాల్పులకు కారణం ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand School Shooting: థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో టీచర్ ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ఓ విద్యార్థిగా గుర్తించారు. దాడి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన 20 మందిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన వారి వివరాలు, వారి పరిస్థితిపై ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని బాంగ్ క్రూయై జిల్లాలో ఉన్న డెబ్సిరిన్ నోంతాబురి స్కూల్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ప్లాయ్ బ్యాంగ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు పాఠశాల ప్రాంగణానికి చేరుకుని ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఘటనను లైవ్‌స్ట్రీమ్ చేయొద్దని పోలీసుల విజ్ఞప్తి
పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్న సమయంలో ఘటనకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో లైవ్‌స్ట్రీమ్ చేయవద్దని ప్రజలను అధికారులు కోరారు. ఇది పోలీసుల ఆపరేషన్‌కు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని సూచించారు.
కాల్పులకు కారణం ఏమిటి?
కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్న విద్యార్థి ఎవరు, దాడికి గల కారణం ఏమిటన్న దానిపై ప్రస్తుతానికి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. పోలీసులు పాఠశాల ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఘటనకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాల్పుల వెనుక ఉద్దేశం, దాడికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!