Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది. పార్టీ సూచనలను పక్కనపెట్టి డైరెక్టర్ పదవికి నామినేషన్ వేసి.. అనంతరం ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికైన చలసాని ఆంజనేయులు వ్యవహారాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో విజయ డెయిరీ ఎపిసోడ్లో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. చలసాని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విజయ డెయిరీ డైరెక్టర్‌గా నామినేషన్ వేయొద్దని పార్టీ పెద్దలు సూచించినప్పటికీ.. చలసాని ఆంజనేయులు నామినేషన్ వేసి, ఆపై చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఆయన వ్యవహరించడంపై అధిష్ఠానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. చైర్మన్‌గా రాజీనామా చేయాలని మంత్రులు సారధి, కొల్లు రవీంద్ర చలసానిపై ఒత్తిడి చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన అంశాన్ని టీడీపీ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాల మధ్య చలసాని ఆస్పత్రిలో చేరడంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గత కొన్నేళ్లుగా చలసాని ఆంజనేయులుపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. విజయ డెయిరీ వ్యవహారంలోనూ వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజాగా చలసాని చైర్మన్‌గా ఎన్నిక కావడం, పార్టీ అధిష్ఠానం నుంచి రాజీనామా చేయాలనే ఒత్తిడి వచ్చినట్లు ప్రచారం జరగడం నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చైర్మన్ పదవికి ఎన్నికైన వెంటనే తలెత్తిన ఈ పరిణామాలతో విజయ డెయిరీ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చలసాని ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో పార్టీ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?, చైర్మన్ పదవిపై ఏం జరుగుతుంది? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!