Venu Goapl Reddy
Author- NTV Telugu-
Manipur: మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్..
Manipur: మణిపూర్ కొత్త సీఎంగా బీజేపీకి చెందిన యమునాం ఖేమ్‌చంద్ సింగ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. జాతి ఘర్షణల కారణంగా గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. -
India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్‌పై కేంద్రం కీలక ప్రకటన..
India-US Trade deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అమెరికాతో ‘‘సాధ్యమైనంత ఉత్తమైన’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని అన్నారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధం కారణంగా ఈ ఒప్పందం ఖరారైందని వెల్లడించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలతో సహా అనేక రంగాలకు ఇది ప్రయోజనకరంగా […] -
Australia: ఆస్ట్రేలియాలో 420 కిలోల గాంధీ విగ్రహం చోరీ..
Australia: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాం దొంగతానికి గురైంది. గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ముందు ఏర్పాటు చేశారు. దీనిని దుండగులు చోరీ చేశారు. ఈ విగ్రహం బరువు సుమారు 420-426 కిలోలు ఉంటుంది. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) దీనిని బహుమతిగా అందించింది. -
Pakistan: ‘‘మా సైన్యం వల్ల కావడం లేదు’’.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Pakistan: బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)ను ఎదుర్కోవడంలో తమ సైన్యం వల్ల కావడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడంతో పాక్ భద్రతా బలగాలు అలసిపోతున్నాయని చెప్పారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన... పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ విస్తీర్ణమే భద్రతా బలగాలకు ప్రధాన సవాల్ అని అన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
Adani-Italy Deal: అదానీ-లియోనార్డో కీలక ఒప్పందం.. భారత్‌లో హెలికాప్టర్ ఉత్పత్తి..
Adani-Italy Deal: అదానీ గ్రూప్, ఇటలీకి చెందిన లియోనార్డో ఏరోస్పేస్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. భారత్‌లో హెలికాప్టర్ల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యాన్నికి సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) మంగళవారం న్యూఢిల్లీలో కుదిరింది. ఈ భాగస్వామ్యం ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ప్రోగ్రాంకు ముందడుగుగా భావిస్తున్నారు. హెలికాప్టర్ల తయారీలో భారత్ స్వయం సమృద్ధిగా మారే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో ఒక ఇంటిగ్రేటెడ్ హెలికాప్టర్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. […] -
Parliament Budget Session: లోక్‌సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్..
విపక్ష సభ్యులు సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేశారు. దీంతో 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీల్లో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరెన్ రెడ్డి, వెంకట్ రామన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. స్పీకర్ ఈ సంఘటనను ఖండించారు. పార్లమెంటరీ మర్యాదను ఉల్లంఘనగా అభివర్ణించారు. -
Russia On Trade Deal: ‘‘భారత్ చమురు కొనుగోలు నిలిపేస్తుందని చెప్పలేదు’’.. యూఎస్‌తో డీల్‌పై రష్యా కామెంట్స్..
Russia On Trade Deal: భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాలు కూడా తమ వాణిజ్యాన్ని మరింత విస్తరించాలని కోరుకున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఈ డీల్‌పై రష్యా స్పందించింది. -
India-US Deal: భారత రైతులకు భద్రత, వెనిజులా నుంచి చమురు.. భారత్-యూఎస్ డీల్..
India-US Deal: భారత్-అమెరికా మధ్య ప్రతిష్టాత్మక ట్రేడ్ డీల్ ఓకే అయింది. భారత్‌పై ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇదిలా ఉంటే, భారత రైతులు ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించలేదని ట్రేడ్ డీల్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆంక్షలు లేని’’ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే రెండో అతిపెద్ద దేశంగా ఉంది, అయితే, ఇప్పుడు […] -
Modi-Trump: ప్రధాని మోడీతో మాట్లాడిన ట్రంప్.. యూఎస్ రాయబారి ఆసక్తికర పోస్ట్..
Modi-Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఈరోజు(సోమవారం) ఫోన్లో మాట్లాడినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ట్విట్టర్ పోస్టులో ‘‘స్టే ట్యూన్డ్’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అయితే, ఇరువురు నేతలు ఏ విషయంపై మాట్లాడారనే వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే, భారత్-అమెరికా మధ్య కీలక వాణజ్య ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. Read Also: […] -
Budget 2026-27: కేంద్ర బడ్జెట్.. ధరలు తగ్గనున్న 17 రకాల క్యాన్సర్ మందుల ఇవే..
Budget 2026-27: కేంద్ర బడ్జెట్ 2026-27లో క్యాన్సర్ రోగులకు ఉపశమనం ఇచ్చింది. 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించింది. దీని వల్ల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి చికిత్స మరింత చౌకగా మారనుంది. క్యాన్సర్ చికిత్సకు వాడే డ్రగ్స్ తరుచుగా విదేశాల నుంచి భారత్‌కు వస్తుంటాయి.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!