Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాను వణికిస్తున్నాయి. లైంగిక నేరస్తుడు, ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను 30 రోజుల్లోగా విడుదల చేయాలని గత నెలలో అమెరికా అధ్యక్షుడు ఒక బిల్లుపు సంతకం చేశాడు. శుక్రవారం అమెరికా న్యాయ శాఖ(DOJ) వేలాది ఫైళ్లను విడుదల చేసింది. ఈ ఫైళ్లలో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖల పేర్లు, ఫోటోలు ఉండటం సంచలనంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సహా, ఇప్పటి అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, మైఖెల్ జాక్సన్ ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే, కావాలనే ట్రంప్ ప్రభుత్వం కొన్ని సెలెక్టెడ్ ఫైళ్లను మాత్రమే విడుదల చేస్తోందని ప్రతిపక్ష డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ట్రంప్ ఎప్స్టీన్‌తో చాలా సంవత్సరాల పాటు స్నేహం చేశారు, ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి, వీరిద్దరి మధ్య సంబంధం కూడా పెద్ద రాజకీయ వివాదానికి దారి తీసింది. ఫైళ్లలో ట్రంప్ ఫోటోలు తక్కువగా ఉన్నాయని న్యాయశాఖ చెబుతోంది.
ఇదిలా ఉంటే, కొత్తగా విడుదలైన ఫైల్స్‌లో భారతీయ ఆయుర్వేదం, మసాజ్ టెక్నిక్స్ గురించి ప్రస్తావించింది. భారతదేశంలో పుట్టిన 5000 ఏళ్ల ప్రాచీన సహజ వైద్య విధానం గురించి పేర్కొన్నాయి. నువ్వుల నూనె ఉపయోగించి డీటాక్సిఫికేషన్ చేసే మసాజ్ పద్ధతులను గురించి ఉంది. “పాశ్చాత్య దేశాలలో చాలా మంది వైద్యులు ఇప్పుడు భారతదేశం నుండి వచ్చిన 5,000 సంవత్సరాల పురాతనమైన ఈ సహజ వైద్యం వ్యవస్థ ఆధారంగా మసాజ్, ఇతర చికిత్సలను అందిస్తున్నారు” అని అది చెబుతోంది. ‘ది ఆర్ట్ ఆఫ్ గివింగ్ మసాజ్’ అనే శీర్షికతో కథనాలు కూడా ఉన్నాయి.
Read Also: China Mega Dam: భారత్ – చైనా మధ్య వాటర్ బాంబ్.. డేంజర్ జోన్‌లో ఇండియా!
ఏమిటి ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్:
ఈ కేసులో జెఫ్రీ ఎప్‌స్టీన్ అతని భాగస్వామి ఘిస్లైన్ మాక్స్‌వెల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2002-2005 మధ్య జరిగిన ఈ సెక్స్ కుంభకోణంలో అనేక మంది యువతులకు డబ్బును ఎరగా వేసి జెఫ్రీ లైంగిక దాడులు చేయడమే కాకుండా, అనేక మంది అమెరికా పెద్దమనుషులకు మైనర్ అమ్మాయిలను సఫ్లై చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితుల్లో ఒకరైన వర్జీనియా గియుఫ్రే 2015లో సివిల్ దావా వేయడంతో ఈ పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫైళ్లలో అమెరికా రాజకీయ నాయకుల నుంచి పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఎప్‌స్టీన్ తన సెక్స్ ట్రాఫికింగ్ వ్యాపారాన్ని నిర్వహించడంలో అతనికి అనేక మంది సహకరించినట్లు ఈ ఫైల్స్ పేర్కొంది. ఎలా ఎప్‌స్టిన్, మాక్స్ వెల్ యుక్తవయసులోని బాలికలకు ఎలా ఈ అక్రమ రవాణా వ్యాపారంలోకి ఆకర్షించారనే వివరాలను ఫైల్స్ వెల్లడించే అవకాశం ఉంది. జులై 2019లో ఎప్స్టీన్‌పై సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు మోపారు, అయితే అతను విచారణకు రాకముందే మాన్‌హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మాక్స్‌వెల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.