Ukraine Russia War: ఉక్రెయిన్ రష్యాపై భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా వైమానిక స్థావరం టార్గెట్‌గా జరిపిన దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ దేశీయ భద్రతా సంస్థ, సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (SBU) అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఉక్రెయిన్‌పై లాంగ్-రేంజ్ క్షిపణులను ప్రయోగించడానికి మోహరించే Tu-95, Tu-22 వ్యూహాత్మక బాంబర్లతో సహా రష్యన్ విమానాలను ఉక్రెయిన్ దళాలు నాశనం చేసినట్లు పేర్కొంది.
Amit Shah: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి మమతా ‘‘ఆపరేషన్ సిందూర్’’, ‘‘వక్ఫ్ చట్టాన్ని’’ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల, ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లు రాష్ట్ర స్పాన్సర్ చేసిందని అన్నారు. ‘‘ ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి, మమతా దీదీ ఆపరేషన్ సిందూర్‌ను వ్యతిరేకించారు. అలా చేయడం ద్వారా, ఆమె ఈ దేశంలోని తల్లులు, […]
Sharmistha Panoli Arrest: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని షర్మిష్ట పనోలి అరెస్ట్‌పై బీజేపీ సహా ఎన్డీయే నేతలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శర్మిష్ట పోస్ట్ చేసిన వీడియో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని చెబుతూ, బెంగాల్ పోలీసులు శుక్రవారం ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు.
Karnataka: కర్ణాటక బెళగావిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరుగురు నిందితులు బాలికపై రెండుసార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ చర్యని వారు మొబైల్ ఫోన్లో వీడియో తీసి బాలికను బ్లాక్మెయిల్ చేశారు. ఈ బ్లాక్మెయిల్ బాలిక రెండోసారి గ్యాంగ్ రేప్‌కి గురవ్వడానికి కారణమైంది.
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అతిపెద్ద విచారణను ప్రారంభించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడినట్లు బంగ్లాదేశ్ అభియోగాలు నమోదు చేసింది. గతేడాది, హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె దేశం నుంచి పారిపోయి భారత్ చేరుకుంది. ప్రస్తుతం, భారత్‌లోనే ఆశ్రయం పొందుతోంది.
Israel:గాజాలో ఇజ్రాయిల్ విధ్వంసం సృష్టిస్తోంది. దక్షిణ గాజాలోని రఫాలో యూఎస్ నిధులతో నడిచే ఒక సహాయక పంపిణీ కేంద్రం సమీపంలో ఇజ్రాయిల్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. 115 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం వేలాది మంది పాలస్తీనియన్లు సహాయక కేంద్రం వద్ద గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇజ్రాయిల్ ట్యాంకులు జనంపైకి కాల్పులు జరిపినట్లు పాలస్తీనా జర్నలిస్టులు చెబుతున్నారు. మృతులను, గాయపడిన వారిని గాడిద బండ్లపై సంఘటనా […]
Sharmishta Panoli: ‘‘ఆల్ ఐస్ ఆన్ షర్మిష్ట’’ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. షర్మిష్టకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై సోషల్ మీడియాలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంగా బెంగాల్ పోలీసులు శుక్రవారం గురుగ్రామ్ నుంచి అరెస్ట్ చేశారు.
Mallikarjun Kharge: ఇటీవల పాకిస్తాన్‌పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’లో కొన్ని వైమానిక నష్టాలు కలిగినట్లు ఈ రోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ అంగీకరించారు. తప్పులను సరిదిద్దుకున్న తర్వాత వ్యూహాత్మకంగా పాకిస్తాన్లోకి వెళ్లి దాడులు చేసినట్లు చెప్పారు.
India-Pakistan: ఇటీవల ఇరాన్లో కనిపించకుండా పోయిన ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌లో పాకిస్తాన్ హస్తం ఉందా.? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అపహరణకు గురైన వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.