PM Modi: కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది. జీ-7 అనేది ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, కెనడాల కూటమి. అయితే, ఈ సమావేశాలకు యూరోపియన్ యూనియన్(ఈయూ), ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితికి ఆహ్వానాలు అందాయి.
Bangladesh: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
Viral Video: బెంగళూర్‌లో ఒక మహిళ ఆటో డ్రైవర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఈ సంఘటనలో మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పంఖూరి మిశ్రా అనే మహిళ డ్రైవర్ లోకేష్‌ను చెప్పుతో కొట్టింది. పంఖూరి తన భర్తతో బైక్‌పై వెళ్తున్న సమయంలో, ఆటో డ్రైవర్ తన కాలుపై నుంచి పోనిచ్చాడని ఆమె ఆరోపించింది.
Bihar Assembly elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22, 2025తో ముగుస్తుంది. దీనికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి, ఛత్ పండగల్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. Read Also: Russia Ukraine War: ట్రక్కుల్లో 117 డ్రోన్లు,18 నెలల ప్లానింగ్.. రష్యాను దారుణంగా […]
Russia Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడితో ప్రపంచమే అబ్బురపడుతోంది. రష్యాలోని సుదూర ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మూడేళ్ల యుద్ధంలో ఈ రకంగా రష్యాపై దాడి జరగడం ఇదే తొలిసారి. అణు సామర్థ్యం కలిగిన బాంబర్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. 40 కంటే ఎక్కువ రష్యన్ విమానాలు ధ్వంసమైంది. బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. టర్కీలో శాంతి చర్చలు ప్రకటించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ఈ దాడిని ‘‘అద్భుతమైన…
Anna University Case: తమిళనాడులో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. స్థానికంగా బిర్యానీ విక్రేత అయిన నిందితుడు జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదు విధించబడింది. విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడినందుకు చెన్నైలోని మహిళా కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు రూ. 90,000 జరిమానా విధించింది.
BJP MP: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్‌లోని ప్రతీ ప్రాంతంలో ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని ఆయన ఆదివారం అన్నారు. భారతదేశం పట్ల పాకిస్తాన్‌కి భయం ఉందని, భారత్ తమను మళ్లీ విభజిస్తుందనే భయం వారిలో ఉందని అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం అప్పుల భారంతో నిండిపోయిందని, ప్రజలు ఆకలితో బాధపడుతుందని ఆయన అన్నారు.
Bhopal: భోపాల్‌కి చెందిన ఎస్ఐ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. జిమ్ యజమానుల సమావేశంలో ఎస్ఐ దినేష్ శర్మ మాట్లాడుతూ.. ముస్లిం ట్రైనర్లు, శిక్షణ తీసుకోవడానికి వచ్చే వారిని జిమ్‌లోకి అనుమతించకూడదని జిమ్ యజమానులకు సూచించాడు. వీడియోలో ‘శిక్షణ ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఏ ముస్లిం ఇక్కడకు రాడు.
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మదిగా తన చరిత్రను మరిచిపోతోంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం సాధించడానికి కారణమైన షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే బంగ్లాదేశ్ తన కరెన్సీ నోట్లపై జాతిపితగా పేరుగాంచిన ముజిబుర్ రెహమాన్ ఫోటోని తీసేస్తున్నారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ పంపిన డ్రోన్లను భారత్ అడ్డుకుంది. వందల సంఖ్యలో పాకిస్తాన్ పంపిన డ్రోన్లు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంది. టర్కీకి చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన బైరెక్తర్ TB2 డ్రోన్ వలయాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. ఒక్క డ్రోన్ కూడా తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత స్వదేశీ తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ‘‘ఆకాష్ తీర్’’ వ్యవస్థ టర్కిష్ డ్రోన్లను కూల్చేసింది.