India: భారతదేశ రక్షణరంగ ఉత్పత్తులు 2024-25(FY25)లో ఆల్ టైమ్ రికార్డ్‌కి చేరుకున్నాయి. ఏకంగా 1.46 ట్రిలియన్లకు చేరుకున్నట్లు, ఇది 2024 ఆర్థిక సంవత్సరం(FY24)తో పోలిస్తే రూ. 1.27 ట్రిలియన్ల నుంచి దాదాపుగా 15 శాతం పెరిగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తెలిపారు. రక్షణ రంగ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రికార్డు స్థాయిలో గరిష్టానికి చేరుకున్నాయని వెల్లడించారు. FY24లో రూ.21,083 కోట్ల నుండి ఎగుమతులు దాదాపు 14 శాతం పెరిగాయని ఆయన అన్నారు.
రక్షణ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రైవేట్ రంగం షేర్ రూ. 32,000 కోట్లకు పైగా ఉందని అన్నారు. ఇది మొత్తం రక్షణ ఉత్పత్తిలో దాదాపు 22 శాతం. న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. FY24లో ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం వాటా 20.8 శాతంగా ఉండేది.
రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇటీవల ఆమోదించిన 5వ తరం యుద్ధ విమాన తయారీకి సంబంధించి అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ కింద, మొదటిసారిగా, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగానికి కూడా ఒక ప్రధాన రక్షణ ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం ఉంటుందని నొక్కి చెప్పారు. AMCA ప్రాజెక్ట్ కింద, ఐదు ప్రోటోటైప్‌లను తయారు చేయాలనేది ప్రణాళిక, దీని తర్వాత ఉత్పత్తి జరుగుతుంది. ఇది మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం చరిత్రలో కీలక మైలురాయిగా రాజ్‌నాథ్ అభివర్ణించారు.
Read Also: PM Modi: కెనడా “G-7 సమ్మిట్”కు ప్రధాని మోడీ వెళ్లడం లేదు.. రెండు దేశాల మధ్య సంబంధాలే కారణం.!
భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వకారణమని ఆయన అన్నారు. దేశ వృద్ధిలో రక్షణ రంగం విలువైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. 10 సంవత్సరాల క్రితం మన రక్షణ రంగ ఉత్పత్తి సుమారుగా రూ. 43,000 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.1.46 ట్రిలియన్లకు చేరుకుందని వెల్లడించారు. 10 ఏళ్ల క్రితం భారత రక్షణ ఎగుమతులు రూ.600-700 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ. 24,000 కోట్ల రికార్డును అధిగమించినట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భారత ఆయుధాలు, పరికలు, సేవలు దాదాపు 100 దేశాలకు చేరుకున్నాయని అన్నారు.
గత ఐదేళ్లలో మొదటిసారిగా ప్రభుత్వ బడ్జెట్‌ని ఆధునీకకరించామని, రూ. 2 ట్రిలియన్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేశామని, ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1 ట్రిలియన్ రికార్డు కంటే రెట్టింపు అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. GDPలో 1.9 శాతం ఉన్నప్పటికీ రక్షణ బడ్జెట్ గణనీయంగా ఉందని ఆయన చెప్పారు.