Indian YouTuber: టర్కీలో ఇండియన్ యూట్యూబర్ అరెస్ట్.. కారణం ఏంటంటే..
- టర్కీలో భారత యూట్యూబర్ అరెస్ట్..
- టర్కిష్ మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian YouTuber: టర్కీలో ఇండియన్ యూట్యూబర్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టర్కిష్ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని అనుచిత, అసభ్యకరమై వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ‘‘మాలిక్ స్వాష్‌బక్లర్’’ అని పిలువబడే మాలిక్ ఎస్‌డీ ఖాన్, తన ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలపై విమర్శలకు గురయ్యాడు. టర్కిష్ మహిళపై లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.
ఈ వివాదం నేపథ్యంలో మాలిక్ తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి ఈ వీడియోలను తొలగించినప్పటికీ, కొన్ని వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టర్కీలోని స్థానికులు హిందీని అర్థం చేసుకోలేరని, అతను అసభ్యకరమైన భాషను ఉపయోగించినట్లు వీడియోలో చూడవచ్చు. అతను మహిళపై అత్యాచార బెదిరింపులు, లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: US-India Trade Deal: భారతదేశంతో త్వరలో వాణిజ్య ఒప్పందం: యూఎస్ వాణిజ్య కార్యదర్శి..
ఒక క్లిప్‌లో టర్కిష్ మహిళను ఉద్దేశిస్తూ ‘‘మాల్’’ అని పేర్కొన్నాడు. మరొకదానిలో టర్కిష్ గైడ్‌ని రాత్రిపూట లైంగికంగా వేధించాలా..? అని తన ఆడియన్స్‌ని అడిగాడు. మరొక వీడియోలో ఒక టర్కిష్ దుకాణదారుడితో అసభ్యకరమైన భాషను ఉపయోగించారు. భారతీయ జెండాను ఎందుకు ప్రదర్శించలేదో చెప్పమని అతడిని డిమాండ్ చేశాడు. వీడియోలో ఏం అంటున్నాడో అర్థం చేసుకున్న కొంతమంది టర్కిష్ సోషల్ మీడియా యూజర్లు వీటిని షేర్ చేశారు. దీంతో మాలిక్‌పై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో టర్కీ పోలీసులు మాలిక్ స్వాష్‌బక్లర్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. అయితే, యూట్యూబర్ అరెస్ట్‌పై టర్కీ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ టర్కీ డ్రోన్లు ఉపయోగించి భారత్‌పై దాడులు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలోనే భారతీయ యూట్యూబర్ అరెస్ట్ కేసు వచ్చింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో చాలా మంది భారతీయ పర్యాటకులు టర్కీని బాయ్‌కాట్ చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!