Honour Killing: టిక్‌టాక్ చేస్తుందని 17 ఏళ్ల పాక్ యువతి పరువు హత్య..
- పాకిస్తాన్‌లో 17 ఏళ్ల ఇన్‌ఫ్లూయెన్సర్ హత్య..
- పరువు హత్యగా పోలీసుల అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour Killing: పరువు హత్యలకు కేరాఫ్‌గా ఉన్న పాకిస్తాన్‌లో మరో హత్య జరిగింది. 17 ఏళ్ల యువతిని సొంత బంధువుల్లో ఒకరు కాల్చి చంపారు. టిక్ టాక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న సనా యూసఫ్‌ని ఇస్లామాబాద్‌లో తన ఇంట్లోనే చంపారు. ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా ఆమెకు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సనా యూసుఫ్‌ని బంధువు అతి దగ్గర నుంచి చంపినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.
Read Also: Colorado Attack: యూదు వ్యతిరేకుల వీసాలను రద్దు చేస్తాం.. అమెరికా హెచ్చరిక
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
సెక్టార్ G-13లోని ఆమె ఇంట్లో ఈ సంఘటన జరిగింది. నిందితుడు సనాని చంపేటప్పుడు ఆమె ఇంటి బయట కొంత సమయం మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి, అనేక సార్లు కాల్పులు జరిపి తప్పించుకున్నాడని చెప్పారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయనప్పటికీ, పరువు హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సనా యూసఫ్ వల్ల కుటుంబానికి అవమానం, అగౌరవం కలుగుతుందనే కుటుంబీకులు హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సనా యూసఫ్ తన టిక్‌టాక్ వీడియోలతో పాకిస్తాన్‌లో చాలా ఫేమస్. ఆమె తన వీడియోల ద్వారా మహిళ హక్కులు, సంస్కృతి, విద్యపై అవగాహన ప్రోత్సహించడం వంటివి చెబుతుంది. పాకిస్తాన్‌లో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన చాలా మంది ఇటీవల కాలంలో హత్యలకు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసినందుకు క్వెట్టాలో హీరా అనే 15 ఏళ్ల బాలికను సొంత తండ్రి, మామ కలిసి చంపారు. టిక్ టాక్ వాడటం మానేయాలని నిరాకరించినందుకు ఆమె తండ్రి అన్వరుల్ హక్ కోసంతో ఈ చర్యకు పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!