Ring Road Murder: సోనమ్ రఘువంశీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అత్యంత క్రూరంగా భర్త రాజా రఘువంశీని హత్య చేయించిన మహిళగా సమాజం ఆమెపై దుమ్మెత్తిపోస్తోంది. ప్రియుడు రాజ్ కుష్వాహా మోజులో పడిన సోనమ్, కిరాయి హంతకులతో భర్తని హత్య చేయించింది. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి వెన్నుపోటు పొడిచింది. మే 23న రాజా రఘువంశీ మేఘాలయలో మిస్ అవ్వడం సంచలనంగా మారింది. జూన్ 02న ఆయన మృతదేహం లభించింది. చివరకు ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ పోలీసుల ముందు జూన్ 08న సోనమ్ లొంగిపోయింది.
అయితే, సరిగా ఇలాంటి కేసు 2003లో సంచలనంగా మారింది. బెంగళూర్ ‘‘రింగ్ రోడ్ మర్డర్’’గా ప్రముఖంగా నిలిచింది. కాబోయే భర్తను చంపించిన ఘటన ఆ సమయంలో అందర్ని షాక్‌కి గురి చేసింది.
Read Also: CM Revanth Reddy: నా దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తా.. ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను కదా?
2003 బెంగళూర్ రింగ్ రోడ్ మర్డర్ కేసు:
2003లో, 21 ఏళ్ల లా స్టూడెంట్ శుభ శంకరనారాయణ్‌కి, 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీవీ గిరీష్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ సమయంలోనే గిరీష్ నెలకు లక్షకు పైగా సంపాదిస్తుండే వాడు. నిశ్చితార్థం తర్వాత వివాహాన్ని ఏడాది తర్వాత చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. శుభ కూడా ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి ఫేమస్ న్యాయవాది.
నవంబర్ 30న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన మూడు రోజులకు గిరీష్ హత్యకు గురయ్యాడు. శుభ ప్లాన్ చేసి గిరీష్‌ని హతమార్చింది. శుభ తనను డిన్నర్ కోసం రెస్టారెంట్ తీసుకెళ్లాలని గిరీష్‌ని కోరింది. ఇలా డిన్నర్ వెళ్లి తిరిగి వస్తుండగా, శుభ ప్లాన్ లో భాగంగా HAL విమానాశ్రయం సమీపంలో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవ్వడాన్ని చూడాలని కోరుకుంటున్నానని గిరీష్‌తో చెప్పింది. వారు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడే కాపుకాసి ఉన్న హంతకులు గిరీష్‌పై దాడి చేశారు. శుభ తనను తాను నిర్దోషిని అని చెప్పుకునేందుకు ప్లాన్‌లో భాగంగా కాపాడాలంటూ కేకలు వేసింది. తలకు తీవ్ర గాయాలైన తర్వాత గిరీష్‌ను ఆసుపత్రిలో చేర్చారు. మరుసటి రోజు, అతను చనిపోయినట్లు ప్రకటించారు.
Read Also: CM Revanth Reddy: నా దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తా.. ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను కదా?
శుభ మాటలతో అనుమానం:
హత్య తర్వాత గిరీష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుభను విచారిస్తున్న సమయంలో పొంతనలేని మాటలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీనికి ముందు ఎంగేజ్మెంట్ వీడియోల్లో శుభ నీరసంగా, అయిష్టంగా ఉన్నట్లు గుర్తించారు. హత్య తర్వాత శుభ తన జూనియర్ అరుణ్ వర్మకు 73 సార్లు కాల్స్, అనేక మేసేజ్‌లు పంపించిందని విచారణలో తేలింది. దీంతో శుభనే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఫోన్ లొకేషన్, కాల్ రికార్డ్స్, డిజిటల్ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. ఇలా డిజిటల్ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించిన తొలి కేసుల్లో ఇది కూడా ఒకటి. విచారణలో శుభ, అరుణ్ ప్రేమించుకుంటున్నట్లు తేలింది. తండ్రి ఈ రిలేషన్‌ని అంగీకరించలేదని తేలింది. శుభ, అరుణ్ కలిగి గిరీష్‌ని హతమార్చడానికి ఇద్దరు వ్యక్తుల్ని నియమించుకున్నారు. ఈ కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించబడింది. శుభ సాక్ష్యాలు నాశనం చేసినందుకు కూడా దోషిగా నిర్ధారించబడింది. సుప్రీంకోర్టు 2014లో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.