Air India Crash: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో విమానంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. భారత సంతతి బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నాడు. గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొన్ని సెకన్ల తర్వాత బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. 11ఏ సీటులో కూర్చొన్న విశ్వేష్ కుమార్ రమేష్ కూర్చొన్నారు.
‘‘తాను ఎలా సజీవంగా బయటపడ్డానో నాకు తెలియదు’’ అని అను చెబుతున్నాడు. ఏవియేషన్ నిపుణుల ప్రకారం, రమేష్ బతికి ఉండటం అద్భుతానికి తక్కువ కాదని చెబుతున్నారు. ‘‘ కొంత కాలం నేను చనిపోతానని అనుకున్నాను, కానీ నేను కళ్లు తెరిచినప్పుడు బతికే ఉన్నానని భావించా. నేను నా సీటుతో సహా విమానం నుంచి బయటపడ్డా. సీటు బెల్ట్ తీసేసి అక్కడ నుంచి బయటపడ్డాను. నా కళ్ల ముందే అందరూ చనిపోయారు’’ అని చెప్పారు.
Read Also: PM Modi: “సిందూర్” తర్వాత తొలి విదేశీ పర్యటన.. మూడు దేశాలకు వెళ్తున్న ప్రధాని మోడీ..
అయితే, విమానాల్లో సురక్షితమై సీట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. విమాన ప్రమాద గణాంకాల ప్రకారం, మధ్యలో ఉన్న సీట్ల కన్నా చివరి ఉన్న సీట్లు, ముందు కుడివైపు ఉన్న సీట్లు సురక్షితమైనవిగా చూపిస్తున్నాయి. విమాన ప్రమాదాల్లో ఈ సీట్లలో కూర్చున్న వారు ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే, అహ్మదాబాద్ ప్రమాదంలో రమేష్ 11A సీటులో ఉన్నారు. ఇది రెక్కలకు ముందు ఉంటుంది. ఎకానమీ క్లాస్‌లో మొదటి వరుసలో, బిజినెస్ క్యాబిన్ వెనుక మరియు ఎడమ వైపున ఉన్న ఎగ్జిట్ డోర్‌కి సమీపంలో ఉంటుంది. కానీ రమేష్ సీటు సురక్షితమైన సీటు జాబితాలో లేదు. ఆయన విషయంలో అద్భుతం జరిగిందని ఏవియేషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
రాయిటర్స్ ప్రకారం, 1971 నుండి ప్రమాదాలపై 2007 పాపులర్ మెకానిక్స్ అధ్యయనం ప్రకారం, విమానం వెనుక వైపు ఉన్న ప్రయాణీకులు మెరుగైన మనుగడ అవకాశాలను కలిగి ఉన్నారని కనుగొన్నారు. కొంతమంది నిపుణులు రెక్కలు ఉన్న భాగంలోని సీట్లు స్థిరత్వాన్ని అందిస్తాయని సూచిస్తున్నారు. అయితే, సీట్ కాన్ఫిగరేషన్ విమానాలకు మారుతుంటాయని, ప్రతీ క్రాష్ కూడా ప్రత్యేకమైనదిగా ఉంటుందని, ప్రాణాలతో బయటపడటం తరుచుగా సంక్లిష్టమైన పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ప్రమాదం భిన్నంగా ఉంటుంది మరియు సీటు స్థానం ఆధారంగా మనుగడను అంచనా వేయడం అసాధ్యం” అని అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ అన్నారు.