Rajasthan: భార్య తప్పుడు కట్నం ఆరోపణలు.. అత్తింటి ముందే ‘‘టీ’’ స్టాల్ పెట్టి భర్త నిరసన ..
- వైరల్ అవుతున్న ఓ భర్త నిరసన..
- భార్య తప్పుడు కట్నం ఆరోపణలు..
- అత్తింటి ముందే టీ స్టాల్ పెట్టి భర్త నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు భర్తలపై అక్రమ గృహహింస కేసుల పెట్టి వేధిస్తున్నారు. దీంతో పలువురు మగాళ్లు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు ఇందుకు మంచి ఉదాహరణ. ఇదిలా ఉంటే, రాజస్థాన్‌కి చెందిన కృష్ణ కుమార్ ధాకడ్ కూడా తన భార్య నుంచి ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నాడు. తప్పుడు కేసులో విసిగిపోయిన కృష్ణ వినూత్నంగా తన నిరసన తెలుపుతున్నాడు.
ఏకంగా అత్తమామల ఇంటి ముందు టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారు. వచ్చి వెళ్లే వారికి ‘‘టీ’’ ఇచ్చి తన ఆవేదన వెల్లడిస్తున్నాడు. టీ స్టాల్ పేరును కూడా క్రియేటివ్‌గా సెట్ చేశాడు. “498A T CAF” అని టీ స్టాల్‌కి పేరు పెట్టాడు. 498 ఏ వరకట్న వేధింపుల కేసును సూచిస్తుంది. తన చేతికి ‘‘సంకెళ్లు’’ వేసుకుని టీ అందిస్తున్నాడు. తాను మూడేళ్లుగా పడుతున్న బాధ, అవమానానికి ఇది చిహ్నమని చెబుతున్నాడు.
Also Read
తన టీ స్టాల్ చుట్టూ పోస్టర్లు ఏర్పాటు చేసి, తన బాధను అందులో వ్యక్తపరిచాడు. పోస్టర్లలో “జబ్ తక్ నహీ మిల్తా న్యాయ్, తబ్ తక్ ఉబల్తి రహేగి చాయ్” (నాకు న్యాయం జరిగే వరకు, టీ మరుగుతూనే ఉంటుంది) మరియు “ఆవో చాయ్ పర్ కరేన్ చర్చా, 125 మే కిత్నా దేనా పడేగా ఖర్చా” వంటి నినాదాలు ఉన్నాయి. ఇవి అతడిపై ఉన్న IPC సెక్షన్లు 498A, 125 లను సూచిస్తాయి.
Read Also: Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
ధకాద్ 2018లో మీనాక్షి మాలావ్‌ను వివాహం చేసుకున్నాడు. కలిసి, వారు తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు, స్థానిక మహిళలకు అధికారం కల్పించారు. దీంతో వీరు గుర్తింపు పొందారు. మాజీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 2021లో వీరి తేనె వ్యాపార సంస్థను ప్రారంభించారు. అయితే, 2022లో కృష్ణ భార్య ఎలాంటి సమాచారం లేకుండా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కృష్ణపై IPC సెక్షన్ 498A (కట్నం వేధింపులు), సెక్షన్ 125 (భరణం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
“ఒక తప్పుడు కేసు కారణంగా అంతా నాశనమైంది. గత మూడు సంవత్సరాలుగా, నేను న్యాయం కోసం కోర్టుకు తిరుగుతున్నాను. నాకు నాపై ఆధారపడిన వృద్ధ తల్లి ఉంది. నేను టిన్ షెడ్ కింద నివసిస్తున్నాను, నాకు ఏమీ మిగిలి లేదు. చాలాసార్లు నా జీవితాన్ని ముగించాలని అనుకున్నాను, కానీ నా తల్లికి ఏకైక మద్దతు నేనే అని నాకు గుర్తుకు వస్తుంది’’ అని తన బాధను చెబుతున్నాడు. నాపై తప్పుడు కేసు పెట్టిన ప్రాంతంలోనే టీ అమ్ముతున్నానని, ఈ న్యాయ పోరాటంలో నిష్పాక్షికంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
అయితే, కృష్ణ భార్య మీనాక్షీ మలావ్ మాట్లాడుతూ.. ‘‘అతను భూమి కొనేందుకు నా తండ్రిని డబ్బులు అడిగాడు. మేము నిరాకరించినప్పుడు నన్ను కొట్టాడు. ఆ తర్వాత నేను నా తల్లిదండ్రుల ఇంటికి వచ్చాను. నేను విడాకులకు సిద్ధంగా ఉన్నాను. కానీ ముందుగా నా పేరు మీద తీసుకున్న అప్పులు అన్ని తిరిగి చెల్లించాలి’’ అని చెప్పింది. ఇప్పుడు వీరిద్దరి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!