Venu Goapl Reddy
Author- NTV Telugu-
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం.. అగ్నిప్రమాదంలో ఐదుగురి మృతి
Fire accident in Uttar pradesh: పెళ్లింట్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేదికలో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ముందుగా ఓ పెళ్లి వేదికలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తరువాత అవి మూడొంతస్తుల భవనానికి వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న ఐదుగురు మరణించారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు. చనిపోయిన వారంత ఒకే కుటుంబానికి చెందినవారే. -
Terror Links: అస్సాంలో 34 మంది అరెస్ట్.. చెన్నైలో యువకుడి అరెస్ట్
Assam Police arrests over 34 people with Al-Qaeda links: అస్సాం రాష్ట్రంలో టెర్రర్ లింకులు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో అస్సాంలోని పలు జిల్లాల్లో ఇమామ్ లుగా పనిచేస్తున్న వారితో పాటు మదరసా కేంద్రంగా ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న వారిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్ ఖైదా అనుబంధంగా ఉన్న అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థ తరుపున పని చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా అస్సాంలో గురువారం మరికొన్ని అరెస్టులు జరిగాయి. అల్ ఖైదాతో సంబంధం ఉన్న 34… -
COVID 19: ఇండియాలో పదివేలకు పైగా కేసులు.. 13 వేల రికవరీలు
covid cases in india: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గతంలో కన్నా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లే చెప్పవచ్చు. వారం రోజుల క్రితం దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అయ్యేది. అయితే ప్రస్తుతం మాత్రం రోజూవారీ కోవిడ్ కేసులు 10 వేలకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి. -
Rishi Sunak: రిషి సునక్ దంపతుల “గో పూజ”.. వీడియో వైరల్
Rishi Sunak and wife perform ‘gau pooja’ in London, video goes viral: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్.. హిందూ ఆచారాలను పాటిస్తారని అందరికీ తెలుసు. కుటుంబ సమేతంగా హిందూ పండగలను జరుపుకుంటారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్ ఏం చేసినా.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా రిషిసునక్, అతని భార్య అక్షతా మూర్తి కలిసి ‘గో పూజ’లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో బ్రిటన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రిషి… -
Racist Attack In USA: భారతీయులపై జాత్యహంకార దాడి.. వీడియో వైరల్
Racist attack on Indians in America: అమెరికాలో జాత్యహంకార దాడి జరిగింది. నలుగురు భారతీయ-అమెకన్లపై ఓ మహిళ జాతిపరంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు భారతీయ-అమెరికన్ మహిళలు మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఓ మహిళ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసింది. భారత్ కు తిరిగి వెళ్లండి అంటూ దుర్భాషలాడింది. -
CJI NV Ramana: నేడు సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ
CJI NV Ramana retires today: భారత ప్రధాన న్యాయమూర్తి( సీజేఐ)గా ఎన్వీ రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 24, 2021లో బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 26, 2022న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా చివరి రోజు పలు హై ప్రొఫైల్ కేసులును విచారించారు. గురువారం రోజు పెగాసస్ స్పైవేర్ కేసుతో పాటు, ఇటీవల బిల్కిస్ బానో కేసులో శిక్ష అనుభవిస్తున్న… -
Taiwan: తైవాన్ లో మరో అమెరికన్ లీడర్ పర్యటన.. చైనాకు భయపడేది లేదంటూ ట్వీట్.
US senator Marsha Blackburn visits Taiwan: యూఎస్ స్పీకర్ నాన్సిపెలోసి తైవాన్ పర్యటన తైవాన్ - చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నాన్సి పెలోసీ పర్యటనను డ్రాగన్ కంట్రీ వ్యతిరేకించింది. అమెరికాకు నిప్పుతో చెలగాటం అడుతున్నారంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే తాజాగా మరో అమెరికన్ లీడర్ తైవాన్ లో పర్యటిస్తున్నారు. తాజాగా అమెరికన్ సెనెటర్, టెన్సెసీకి చెందిన రిపబ్లికన్ నేత మార్షా బ్లాక్బర్న్ గురువారం తైవాన్ చేరారు. ప్రత్యేక విమానంలో తైపీ సాంగ్ షాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. -
United Nations Security Council: రష్యాకు వ్యతిరేకంగా తొలిసారి భారత్ ఓటు.. జెలెన్ స్కీకి మద్దతు
United Nations Security Council: రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో భారత్ తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మాణానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. అయితే జెలెన్ స్కీ మాట్లాడేందుకు రష్యా వ్యతిరేకించింది. మొత్తం 15 సభ్య దేశాలు ఉన్న భద్రతా మండలిలో భారత్ తో పాటు మొత్తం 13 దేశాలు జెలెన్ స్కీకి మద్దతుగా నిలవగా.. రష్యా వ్యతిరేకించింది. చైనా ఓటింగ్ కు… -
Sonali Phogat: బీజేపీ నాయకురాలి మరణంలో ట్విస్ట్.. శరీరంపై గాయాలు.. ఇద్దరి అరెస్ట్
BJP leader Sonali Phogat suspicious death: టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్(43) మరణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల గోవాలో పర్యటిస్తున్న సందర్భంలో ఆమె హఠాన్మరణం చోటు చేసుకుంది. ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె అటాప్సీ పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
Italy: డెడ్లీ కాంబినేషన్.. ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్, హెచ్ఐవీ
Man Tests Positive For Monkeypox, COVID-19 And HIV At The Same Time: ప్రపంచం మొత్తం కరోనా, మంకీపాక్స్ వ్యాధులతో సతమతం అవుతోంది. రెండున్నరేళ్లుగా కరోనా వ్యాధి ప్రపంచాన్ని వదలడం లేదు. ఇక మంకీపాక్స్ వైరస్ ప్రపంచంలో 90కి పైగా దేశాల్లో వ్యాపించింది. ముఖ్యంగా యూరప్, అమెరికా ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల హెచ్ఐవీ, మంకీపాక్స్ కేసులు ఒకే వ్యక్తిలో గుర్తించారు. తాజాగా డెడ్లీ కాంబినేషన్ మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ ఒకే వ్యక్తిలో కనుక్కున్నారు వైద్యులు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?