Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
- విదేశీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి
- క్యాచ్‌లు వదిలేయడం భారీగా దెబ్బతీసింది
- బౌలింగ్ వ్యూహంలోనూ తప్పిదాలు
- భారత ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer on India defeat vs England: ఇంగ్లండ్ పర్యటనను భారత్ భారీ ఓటమితో ముగించింది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా శనివారం జరిగిన ఐదో టీ20లో భారత్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.
విదేశీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి:
‘ఈ సిరీస్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంగ్లండ్‌లో ప్రతి మైదానంలో పరిస్థితులు, పిచ్ స్వభావం భిన్నంగా ఉన్నాయి. ఐదో టీ20 జరిగిన పిచ్ మాత్రం సిరీస్‌లో బ్యాటింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంది. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి త్వరగా అలవాటు పడటం చాలా ముఖ్యం. విదేశాల్లో మైదానాల పరిమాణాలు కూడా భిన్నంగా ఉంటాయి. వాటికి ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది. కానీ మేము ఈ విషయంలో చాలా వెనకపడిపోయాం’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
క్యాచ్‌లు వదిలేయడం భారీగా దెబ్బతీసింది:
‘టీమిండియా ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపాయి. కీలక సమయంలో రెండు క్యాచ్‌లు వదిలేయడం వల్ల ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉంటే ప్రత్యర్థిని 220 నుంచి 225 పరుగుల మధ్య కట్టడి చేసే అవకాశం ఉండేది. 258 పరుగుల భారీ లక్ష్యానికి బదులుగా 220-225 పరుగుల లక్ష్యం ఉంటే భారత్‌కు ఛేదించే అవకాశాలు ఉండేవి. ఫీల్డింగ్ మ్యాచ్‌లను గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలో జట్టు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది’ అని సర్పంచ్ సాబ్ స్పష్టం చేశాడు.
బౌలింగ్ వ్యూహంలోనూ తప్పిదాలు:
‘బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై బౌలర్లు మరింత తెలివిగా వ్యవహరించాల్సింది. కొన్ని సమయాల్లో బంతుల ఎంపిక, వ్యూహాల అమలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. బ్యాటర్లను బోల్తా కొట్టించే విధంగా బౌలింగ్‌లో వైవిధ్యం చూపించాల్సింది. జోస్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ వేగం అందుకుంది. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు మళ్లించింది. భారీ లక్ష్య ఛేదనలో భారత్ పవర్‌ప్లేలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్రంగా దెబ్బతీసింది. భారీ లక్ష్యం ఉందనే ఒత్తిడితో ప్రతి బంతినీ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాము. దాని బదులు భాగస్వామ్యాలు నిర్మించాల్సింది’ అని అభిప్రాయపడ్డాడు.
భారత ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు:
‘ఇలాంటి బ్యాటింగ్ పిచ్‌లపై కొంత సమయం తీసుకుని పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కొందరి బౌలర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలి. కానీ భారత బ్యాటర్లు భాగస్వామ్యాలపై దృష్టి పెట్టకుండా లక్ష్యాన్ని వేగంగా ఛేదించే ప్రయత్నంలో వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇంగ్లండ్ బౌలర్లు తమ ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశారు. స్వదేశీ పరిస్థితుల్లో వారికి అపారమైన అనుభవం ఉండటం కలిసొచ్చింది. సరైన లెంగ్త్‌లతో బౌలింగ్ చేస్తూ భారత బ్యాటర్లపై నిరంతరం ఒత్తిడి కొనసాగించారు. ఈ పర్యటనలో ఎదురైన అనుభవాల నుంచి భారత ఆటగాళ్లు చాలా నేర్చుకుంటారు. భవిష్యత్తులో విదేశీ పరిస్థితుల్లో ఆడేటప్పుడు పిచ్‌లకు త్వరగా అలవాటు పడటం, ఫీల్డింగ్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం కీలకం’ అని శ్రేయస్ స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!