Venu Goapl Reddy
Author- NTV Telugu-
West Bengal: దుర్గా నిమజ్జనంలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి
8 Dead, Several Missing During Idol Immersion: విజయదశమి పండగపూట విషాదం నెలకొంది. దుర్గా మాత విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి భక్తులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. మరికొంత మంది గల్లంతు అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లా మల్బజార్ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది. -
Car Sales Record: దేశంలో కార్ల అమ్మకాల్లో ఆల్ టైం రికార్డ్..
September 2022 car sales record an all-time high in India: దేశంలో కార్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత కార్ల అమ్మకాలు ఆల్ టైం రికార్డ్ సేల్స్ నమోదు చేశాయి. గత రెండేళ్లుగా క్షీణిస్తూ వస్తున్న ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మళ్లీ పూర్వస్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 2022 అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ అయింది. సెప్టెంబర్ నెలలో మొత్తంగా 3,55,946 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. ఇది అంతకుముందు నెల ఆగస్టు సేల్స్ 2,81,210 యూనిట్లతో పోలిస్తే 26 శాతం… -
Asaduddin Owaisi: ముస్లింలలో సంతానోత్పత్తి రేటు క్షీణించింది.. జనాభా నియంత్రణ అవసరం లేదు.
No Need For Population Control says Asaduddin Owaisi: దేశంలో ఇప్పటికే రీప్లేస్మెంట్ రేటు సాధించిందని.. జనాభా నియంత్రణ అవసరం లేదని ఎంఐఎం చీప్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుధవారం ఆర్ఎస్ఎస్ వార్షిక దసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. హిందువులు, ముస్లింలకు ఒకే డీఎన్ఏ ఉంటే అసమతుల్యత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. వృద్ధాప్య జనాభా, వృద్ధులను ఆదుకోలేక నిరుద్యోగ యువత ఆందోళన చెందుతుందని ఆయన అన్నారు. సంతానోత్పత్తి రేటు ముస్లింలతో తీవ్రంగా… -
HD Kumaraswamy: కేసీఆర్ విజనరీ, ఛాలెంజింగ్, లెజెండరీ లీడర్
HD Kumaraswamy comments on cm kcr and BRS: దళితుల పట్ల రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న కమిట్మెంట్ గొప్పది.. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణలో విజయం సాధించారని అన్నారు జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామి. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతగా పోరాటం చేశారో మాకు తెలుసని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా వున్నారని ఆయన అన్నారు. అదే పద్దతిలో దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. -
The Sun: సూర్యుడిపై భారీ విస్పోటనం.. 2 లక్షల కిలోమీటర్ల పొడవైన సౌరజ్వాల
A huge explosion on the sun: సూర్యుడిపై ఇటీవల కాలంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా సౌర విస్పోటనాలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్(సీఎంఈ) వెలువడుతున్నాయి. మంగళవారం సూర్యుడిపై భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సూర్యుడి ఉపరితలం నుంచి 2 లక్షల కిలోమీటర్ మేర సౌరజ్వాల ఎగిసిపడింది. పేలుడు నుంచి వెలువడిని సౌరజ్వాల భూమి వైపుగా రావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
kabul Blast: ఆఫ్ఘనిస్తాన్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
Bomb blast in Kabul: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్ లోని ప్రభుత్వ కాంప్లెక్స్ లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. తాలిబాన్ నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోని మసీదులో బుధవారం పేలుడు సంభవించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. -
Sonia Gandhi: మైసూరు ఆలయంలో సోనియాగాంధీ ప్రత్యేక పూజలు
Sonia Gandhi Offers Prayers At Mysuru Temple: దసరా సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సోనియాగాంధీ మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ ఆలయంలో పూజలు చేశారు. కర్ణాటకలో జరుగుతున్న కాంగ్రెస్ జోడో యాత్రలో గురువారం పాల్గొనబోతున్నారు సోనియాగాంధీ. దీని కోసం ఆమె సోమవారమే కర్ణాటక చేరుకున్నారు. మైసూరులో ఓ ప్రైవేట్ రిసార్టులో ఆమె ఉన్నారు. -
Fake Job Racket: నకిలీ జాబ్స్ మోసం.. మయన్మార్ నుంచి 13మంది ఇండియన్స్ సేఫ్
13 Indians trapped in fake IT job racket rescued from Myanmar: నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించారు. మయన్మార్ దేశంలో ఐటీ జాబ్స్ కోసమని వెళ్లారు 45 మంది భారతీయులు. అయితే అక్కడి వెళ్లాక కానీ తెలియలేదు తామంతా మోసపోయామని. మయన్మార్ లోని మైవడ్డీ ప్రాంతంలో అంతర్జాతీయ జాబ్ రాకెట్ బారిన పడిన 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. వీరంతా బుధవారం తమిళనాడుకు… -
Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టివేత
Gold seizure in Delhi: ఢిల్లీలో భారీగా బంగారం పట్టుబడింది. ఈశాన్య ఢిల్లీలో డీఆర్ఐ అధికారులు రూ.33.40 కోట్ల విలువ చేసే 65.46 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఐజ్వాల్ నుంచి ముంబాయి వెళ్తున్న ఓ భారీ కంటైనర్ లో బంగారాన్ని గుర్తించిన పాట్నా, ఢిల్లీ, ముంబాయి డీఆర్ఐ స్పెషల్ టీములు గుర్తించాయి. గోనే సంచుల్లో బంగారం తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు పక్కా ప్లాన్ తో గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేశారు. -
Mukesh Ambani: ముకేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు.. పేల్చేస్తామని హెచ్చరిక
Death threat to Mukesh Ambani Family: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ అధినేత, మల్టీ బిలియనీర్ ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు ఆగంతకులు. బుధవారం మధ్యాహ్నం, 12.57 నిమిషాలకు సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ల్యాండ్ లైన్ నెంబర్ కు తెలియన నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆస్పత్రిని పేల్చేస్తామని హెచ్చరించారు. అంబానీ కుటుంబంలోని కొంతమందిని చంపేస్తామని బెదిరించారు.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!