iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
- యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక ప్రకటన
- ఐఫోన్ 17 సిరీస్‌కు భారీ డిమాండ్
- ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఔట్ ఆఫ్ స్టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Here Is Why iPhone 17 Out Of Stock: సాధారణంగా ‘యాపిల్’ కొత్త ఐఫోన్ సిరీస్ మార్కెట్లోకి వచ్చినపుడు.. పాత మోడళ్ల ధరలు తగ్గడం ఆనవాయితీ. ధరలు తగ్గడంతో యాపిల్ లవర్స్ పాత మోడళ్ల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. 18 సిరీస్ విడుదలకు ఇంకా కొన్ని వారాల సమయం ఉండగానే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ‘ఐఫోన్ 17’ సిరీస్ మోడళ్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అనేక ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా ఐఫోన్ 17 మోడళ్లు ‘ఔట్ ఆఫ్ స్టాక్’గా మారాయి.
ఐఫోన్ 17 సిరీస్ అనూహ్య డిమాండ్ వెనుక ప్రధాన కారణంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చేసిన తాజా వ్యాఖ్యలే అని టెక్ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మెమొరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడంతో యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యయం గణనీయంగా పెరిగిందని టిమ్ కుక్ ఇటీవల వెల్లడించారు. భవిష్యత్తులో కంపెనీ లాభదాయకంగా కొనసాగాలంటే కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచక తప్పదని సంకేతాలు ఇచ్చారు. సీఈఓ ప్రకటన అనంతరం ఐప్యాడ్లు, మ్యాక్బుక్లు, మ్యాక్ కంప్యూటర్ల ధరలను యాపిల్ పెంచింది. అయితే ప్రస్తుతం ఐఫోన్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో తదుపరి ధరల పెంపు ఐఫోన్లకే వర్తించే అవకాశం ఉందని టెక్ ప్రియులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 17 సిరీస్ ధరలు త్వరలోనే పెరగవచ్చనే ప్రచారం వినియోగదారులను ముందుగానే కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తోంది.
Also Read
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
ధరలు పెరిగిన తర్వాత కొనుగోలు చేయడం కంటే ప్రస్తుతం ఉన్న ధరలకే ఐఫోన్ 17ను కొనడం మంచిదని కొనుగోలుదారులు భావిస్తున్నారు. అందుకే భారీ సంఖ్యలో ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు దేశవ్యాప్తంగా అనేక యాపిల్ రిటైల్ స్టోర్లలో కూడా ఐఫోన్ 17 స్టాక్ క్షణాల్లో అమ్ముడవుతోంది. ప్రస్తుతం చాలా చోట్ల స్టాక్ అందుబాటులో లేకపోవడంతో కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.
కొత్త మోడల్ మార్కెట్లోకి రాకముందే పాత మోడల్‌కు ఈ స్థాయిలో డిమాండ్ ఏర్పడటం యాపిల్ బ్రాండ్ ప్రత్యేకతకు నిదర్శనంగా టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ మీరు కూడా ఐఫోన్ 17 కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లు లేదా సమీపంలోని యాపిల్ స్టోర్లలో స్టాక్ అందుబాటును ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది. ఎందుకంటే కొత్త స్టాక్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?