Rahul Gandhi targets PM over release of Bilkis Bano case convicts: బిల్కిస్ బానో అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న 11 మందిని విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఫైర్ అవుతోంది. గ్యాంగ్ రేప్, హత్యలు చేసిన నిందితులను సత్ప్రవర్తన ద్వారా విడుదల చేయడంపై బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. నారీ శక్తి అని స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రసంగించిన ప్రధాని మోదీ కొన్ని గంటల్లోనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను విడుదల చేశారని.. మోదీ మాటలకు, చేతలకు సంబంధం లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Read Also: Ab Raju: చిత్ర పరిశ్రమలో దారుణం.. ఆరేళ్ళ చిన్నారిపై కమెడియన్ రాజు అత్యాచారం
నారీశక్తి గురించి మట్లాడే వారు ఈ దేశంలోని మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఐదు నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, మూడేళ్ల కుమార్తె హత్య చేసిన వారిని ‘ ఆజాదీ కా అమృత్ దినోత్సవ్’ సందర్భంగా విడుదల చేశారని.. నారీ శక్తి గురించ అబద్ధాలు చెప్పే వారు దేశంలోని మహిళకలు ఏం సందేశం ఇస్తున్నారు? అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అంతకుముందు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పపట్టారు. వచ్చే ఎన్నికల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అనుమతి లేకుండా.. గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసిందని అనుకుంటున్నారా..? అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
2002 గోద్రా అల్లర్ల సమయంలో చెలరేగిన మతఘర్షణల్లో బిల్కిస్ బానో అత్యాచార ఉదంతం దేశాన్ని కుదిపేసింది. అల్లర్ల సమయంలో ఐదునెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూడేళ్లు కూతురుతో సహా ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసును ముంబై ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. 11 మందిని దోషులుగా తేలుస్తూ తీర్పు చెప్పింది. ఆ తరువాత బాంబే హైకోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది.