Bengaluru: వరల్డ్ ఎమర్జింగ్ సిటీల జాబితాలో బెంగళూర్.. బ్లూమ్ బెర్గ్ నివేదిక వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru is among the six best emerging cities in the world: భారత నగరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూర్ ఒకటి. భారత సిలికాన్ వ్యాలీగా, సాఫ్ట్ వేర్ రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూర్ ఇప్పుడు ప్రపంచం దృష్టి కూడా ఆకర్షిస్తోంది. తాజాగా బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ స్థాయి నగరాల్లో బెంగళూర్ కూడా ఉంది. బ్లామ్ బెర్గ్ ప్రకారం ప్రవాసుల కోసం అభివృద్ధి చెందుతున్న వరల్డ్ ఎమర్జెంగ్ సిటీల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఆరు నగరాలు చోటు దక్కించుకోగా.. అందులో బెంగళూర్ కూడా ఉండటం విశేషం.
బ్లూమ్ బెర్గ్ ప్రకారం ప్రవాసులను ఆకర్షించడంలో బెంగళూర్ నగరం ముందుంది. ఒక అంచనా ప్రకారం మూలధన ప్రవాహం ( వెంచర్ క్యాపిటల్) లండన్, శాన్ ఫ్రాన్సిస్కోల కన్నా బెంగళూర్ లోకే ఎక్కువగా వస్తున్నాయని వెల్లడించింది. 2016లో 1.3 బిలియన్ డాలర్లు ఉన్న మూలధన నిధులు 2020 నాటికి 7.2 బిలియన్లకు చేరిందని వెల్లడించింది. పెరుగుతున్న ప్రవాసులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, బార్స్ అండ్ రెస్టారెంట్లు వెలుస్తున్నాయని తెలిపింది.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
Read Also: Minister KTR: మోదీ మాటల్లో నిజాయితీ ఉంటే.. వాళ్లని తిరిగి జైలుకు పంపాలి
బెంగళూర్ సాఫ్ట్ వేర్ కేంద్రంగా ఉండటమే కాకుండా.. వందలాది స్టార్టప్స్ కు నిలయంగా మారింది. ఇది విదేశీయులను సైతం ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించడం వల్ల బెంగళూర్ ప్రపంచ స్థాయి నగరంగా మారే అవకాశం ఉందన్ని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది. బెంగళూర్ తో పాటు వరల్డ్ ఎమర్జింగ్ సిటీల జాబితాలో కౌలాలంపూర్, లిస్బన్, మెక్సికో సిటీ, దుబాయ్, రియో డిజెనీరో వంటి నగరాలు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూర్ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. 500 కన్నా ఎక్కువ ఐటీ, బీపీఓ సంస్థలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!