Teenager Kidnapped And physically molested In Goa: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి గోవా, యూపీ రాష్ట్రాల్లో అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చాయి. గోవాలో 17 ఏళ్ల మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. గోవాలోని వాస్కో పట్టణంలో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో బాలిక కుటుంబంలో డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నారు. డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆగస్టు 11న బాలిక ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వాస్కో పట్టణ ప్రాంతంలో బాలికను గుర్తించి రక్షించారు. తనపై నలుగురు వ్యక్తులు వేరువేరు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తన వాగ్మూలంలో తెలిపిందని పోలీస్ అధికారి కపిల్ నాయక్ వెల్లడించారు. నలుగురు నిందితులను ముకుంద్ రావత్, గురు వెంకటేష్ గురుస్వామి, కుష్ జైశ్వాల్, అప్తార్ హుస్సెన్ లుగా గుర్తించారు. వీరిపై పోక్సో, కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారం:
యూపీలో దారుణం జరిగింది. తన ఇంట్లో నిద్రిస్తున్న యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. యూపీ హమీద్ పూర్ గ్రామానికి చెందిన మహిళ భర్త వేరే గ్రామంలో పనిచేస్తున్నాడు. మహిళ తన అత్తతో కలిసి మౌదహా గ్రామంలో ఉంటోంది. అయితే ఈ నెల 11న మహిళ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఐదుగురు నిందితులు ఇంట్లోకి ప్రవేశించి.. మహిళను గదిలోకి దూరి.. ఆమెను వేరే గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అత్యాచార సమయంలో ప్రతిఘటించడంతో తుపాకీ చూపించి బెదిరించారు. అనంతరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ అత్యాచారం ఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.