Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
- ఏసర్ సోస్పిరో A15 విడుదల
- 64 మెగాపిక్సెల్ AI కెమెరా, 5000mAh బ్యాటరీ
- 1.88 అంగుళాల TFT సెకండరీ డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ల్యాప్‌టాప్‌ల తయారీలో పేరొందిన ఏసర్ (Acer) ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్ Acer Sospiro A15ను విడుదల చేసింది. డ్యూయల్ డిస్ప్లే డిజైన్, 64 మెగాపిక్సెల్ AI కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
Acer Sospiro A15 ధర, లభ్యత
Acer Sospiro A15ను ప్రస్తుతం అమెరికా మార్కెట్లో విడుదల చేశారు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫోన్ ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో లిస్ట్ అయ్యింది. ఇది ఆరెంజ్, బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
Also Read
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
- 7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
డ్యూయల్ డిస్ప్లేతో ప్రత్యేక ఆకర్షణ
Acer Sospiro A15లో 6.67 అంగుళాల HD+ IPS డిస్ప్లేను అందించారు. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కు మద్దతు ఇస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో ఫోన్ ఆకర్షణీయమైన రూపాన్ని సంతరించుకుంది. ఈ ఫోన్ ప్రత్యేకత వెనుక భాగంలో ఇచ్చిన 1.88 అంగుళాల TFT సెకండరీ డిస్ప్లే. దీని ద్వారా నోటిఫికేషన్లు చూడడం, మ్యూజిక్ ప్లేబ్యాక్ నియంత్రించడం, అలాగే ప్రధాన కెమెరాతోనే సెల్ఫీలు తీసుకునేందుకు వ్యూఫైండర్‌గా ఉపయోగించుకోవచ్చు.
Unisoc T615 ప్రాసెసర్
పనితీరు కోసం ఈ ఫోన్లో Unisoc T615 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అదనంగా 14GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. అయితే, ఇందులో 5G కనెక్టివిటీ లేకపోవడం కొంతమంది వినియోగదారులకు నిరాశ కలిగించే అంశంగా చెప్పవచ్చు.
64MP AI కెమెరా
ఫోటోగ్రఫీ కోసం Acer Sospiro A15లో 64 మెగాపిక్సెల్ AI ప్రైమరీ కెమెరాను అందించారు. దీనికి తోడు మరో సెకండరీ సెన్సార్, LED ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫోన్లో 5000mAh భారీ బ్యాటరీను అందించారు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. రోజువారీ వినియోగానికి తగిన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించగలదని కంపెనీ తెలిపింది.
ఇతర ఫీచర్లు
Acer Sospiro A15లో పలు ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో Wi-Fi, Bluetooth 5.0, NFC, GPS, VoLTE, ViLTE, FM రేడియో, USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అదనంగా, ఫోన్‌కు IP64 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను కూడా అందించారు.
డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే వంటి ఫీచర్లతో Acer Sospiro A15 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మంచి పోటీని ఇవ్వగలదని భావిస్తున్నారు. అయితే, ధర ప్రకటించిన తర్వాత ఈ ఫోన్ మార్కెట్లో ఎంత మేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.
- Tags
- Acer
- Acer Sospiro A15
తాజావార్తలు
-
Ramayana: ఆస్కార్ రేసులో ‘రామాయణ: పార్ట్ 1’.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
-
Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తుల రాక!
-
Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు