Venu Goapl Reddy
Author- NTV Telugu-
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌తో పాటు 35 చోట్ల ఈడీ దాడులు
Delhi Liquor Policy Case-ED raids: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది ఈడీ. ఈ రాష్ట్రాల్లో మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్వర్క్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. -
Priyanka Chopra: ఇరాన్ మహిళల హిజాబ్ వ్యతిరేక పోరాటానికి ప్రియాంకా చోప్రా మద్దతు
Priyanka Chopra On Anti-Hijab Protests In Iran: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక పోరాటం జరుగుతోంది. అక్కడి యువత, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. 22 ఏళ్ల మహ్సా అమినే అమ్మాయి సెప్టెంబర్ 13న టెహ్రన్ మెట్రోస్టేషన్ వద్ద హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు టార్చర్ వల్ల మహ్సా అమిని మరణించింది. దీంతో ఇరాన్ లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. -
Moon: 2025 నాటికి చంద్రుడిపై మొక్కల పెంపకం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ప్రయత్నాలు
Australian Scientists Seek To Grow Plants On Moon By 2025: చంద్రులు భూమికి ఉన్న సహజ ఉపగ్రహం. భూమిపై జీవజాలానికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది. అందుకే మనం ఉంటున్న భూమిని తల్లిగా.. చంద్రున్ని చందమామగా పిలుస్తుంటాం. భూమి కక్ష్యకు, భూమి స్థిరత్వానికి చంద్రుడు సహకరిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని ఓ టెలివిజన్ అనుకుంటే.. చంద్రుడు ఓ స్టెబిలైజర్ లాంటి వాడు. ఇంతలా భూమికి సహకరిస్తుంటాడు. ఒక వేళ చంద్రుడే లేకపోతే.. మనం ఇప్పుడు నివసిస్తున్న భూమి అనేక ఒడిదొడుకులకు… -
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో నేడు కీలక విచారణ.. కార్బన్ డేటింగ్‌పై నిర్ణయం
Crucial Court Order Today On Carbon Dating Of 'Shivling' In Gyanvapi Case: ఈ ఏడాదిలో ప్రారంభం అయిన జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ముందుగా వారణాసి సివిల్ కోర్టు మసీదులో వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో అక్కడి వాజూఖానాలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. ఒక్కసారిగా ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. ఆ తరువాత ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ… -
Nepal: నేపాల్ లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు..16 మంది దుర్మరణం
Bus falls into river in Nepal: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం నేపాల్ లోని బారా జిల్లాలోని బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నేపాల్ లోని మాధేష్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
Uyghur Muslims Issue: చైనాకు సపోర్టుగా యూఎన్‌లో ఓటింగ్‌కు దూరంగా భారత్..
India abstain on vote against China at UNHRC: ఐక్యరాజ్యసమితిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పుడూ ఉప్పూనిప్పుగా ఉండే భారత్-చైనాలు ఓ విషయంలో మాత్రం సహకరించుకున్నాయి. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో మానవహక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి హక్కుల మండలిలో 51వ రెగ్యులర్ సెషన్ లో చైనాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణంపై భారత్ ఓటింగ్ కు గైర్హాజరు అయింది. -
Karnataka: మసీదులో దసరా పూజ చేసే ప్రయత్నం.. 9 మందిపై కేసు
Mob enters mosque grounds to perform puja on Dussehra: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దసరా సందర్భంగా ఓ వర్గం ప్రజలు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దసరా సందర్భంగా అక్కడ పూజ చేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. 9 మంది కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని బీదర్ మహమూద్ గేవాన్ మదర్సా, మసీదు మైదానాల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. -
Thailand: థాయ్‌లాండ్‌లో దారుణం.. డే కేర్ సెంటర్ కాల్పుల్లో 31 మంది మృతి
At Least 31 Killed In Mass Shooting At Day-Care Centre In Thailand: థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. ఓ ఉన్మాది తుపాకీతో కాల్పులు జరిపాడు. డే కేర్ సెంటర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 31 మంది మరణించినట్లు థాయ్‌లాండ్ పోలీసులు వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. పిల్లలు, పెద్దలతో కలిపి 31 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. Read Also: Free Ration: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి 10 కిలో ఉచిత బియ్యం […] -
Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్ హిమపాతంలో 9కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ హిమపాతంలో గల్లంతైనవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం) హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన సమయంలో హిమపాతం సంభవించి వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఉత్తరకాశీ జిల్లాలోని ద్రౌపది కా దండ శిఖరం వద్ద వారంతా చిక్కుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సహయక, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. -
Flag War : భారత్-పాక్‌ల మధ్య జెండా యుద్ధం.. దేశంలో అతి పెద్దదైన జెండా ఏర్పాటుకు సిద్ధం
Tallest flag in india on the Attari border: దేశంలో అత్యంత ఎత్తైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధం అవుతోంది. ఇండియా-పాకిస్తాన్ బార్డర్ లోని అట్టారీ వద్ద 418 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రెండు దేశాల మధ్య జెండా యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోంది. అట్టారీ-వాఘా బార్డర్ వద్ద పాకిస్తాన్ వైపు భారత్ కన్నా పెద్దదైన పాకిస్తాన్ జెండాను ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా ఇండియా దాని కన్నా…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!