Varicose Veins – Modern Treatments: వేరికోస్ వెయిన్స్ వ్యాధి వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే చాలా మందిలో ఈ వ్యాధికి చికిత్స లేదనే భ్రమలో ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వ్యాధిని నయం చేయడానికి అనేక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.
కాళ్ళలో సిరల వాపు ( వేరికోస్ వెయిన్స్) అనేది రోమన్‌ల కాలంలోనే గుర్తింపు పొందింది. అప్పటి రాతి చిత్రాలలో సయితం కాళ్ళలో సాలీడు మాదిరి నరాల చిత్రీకరణ జరిగింది. తరాల తరాల, యుగ యుగాల నుంచి మానవులు ఎదుర్కొంటున్న అనారోగ్యాలలో వేరికోస్ వెయిన్స్ ఒకటిగా గుర్తింపుపొందింది. వైద్య శాస్త్ర ప్రకారం సుమారు 11 వేలకు పైగా మానవ అనారోగ్యాలలో వేరికోస్ వెయిన్స్ ఒకటైనప్పటికీ గతంలో ఇది ప్రాణాంతకంగా భావించలేదు. కానీ ప్రస్తుతం మారుతున్న జీవన పరిస్ధితులలో ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారింది. ఒకప్పుడు కొందరికే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు అసాధారణ రీతిలో పెరుగుతోంది.
గతంలో భారత జనాభాలో సుమారు 14 శాతం వరకు ఉండే ఈ వ్యాధి ఇప్పుడు 18 శాతాన్ని దాటి పోవడం ఆందోళనకరం పరిస్థితిని తెలయజేస్తోంది. జన్యుపరంగా ఈ వ్యాధి సంక్రమణ ఉంటుంది. లేదా గర్భిణీలలో కొంత శాతం కనిపించేది. కానీ ప్రస్తుత పరిస్దితులలో నిలబడి పనిచేసే వారి సంఖ్య పెరగడం, వృత్తిపరంగా కనీసం కదలకుండా గంటల తరబడి పనిచేయడం వంటి పరిస్ధితుల కారణంగా రోజురోజుకూ వేరికోస్ బాధితులు పెరుగుతున్నారు. కొంతమందికి అరికాలి నుంచి మోకాలి వరకు సిరల వాపు కనిపించకపోయినా రాత్రి అయ్యేసరికి కాళ్లు గుంజుతూ నరకం చూపిస్తున్నాయి. మరికొంతమంది ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయడంతో కాళ్ళలో నల్లటి మచ్చలు, దురద పెరిగి కాలక్రమేణా పుండ్లు పడి జీవన పరిస్ధితులను దెబ్బతీస్తున్నాయి.
మానవ జీవితంలో ముందుకు సాగడానికి కాళ్ళ యొక్క ప్రాధాన్యత మరీ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలన్నా మన గమ్యానికి చేర్చేవి కాళ్లే అయితే వాటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదు. గుండె నుంచి శుభ్రమైన రక్తం తిరిగి కాళ్లకు చేరి తర్వాత అది మళ్లీ గుండెకు చేరే ప్రక్రియలో సిరలలో ప్రతిష్టంభన ఏర్పడితో రక్త ప్రసరణలో అంతరాయం కారణంగా మనిషి ప్రాణానికే ప్రమాదం ఏర్పడే పరిస్ధితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వేరికోస్ వెయిన్స్ కు గతంలో ఉండే వైద్యసేవలలో కూడా మార్పులు వచ్చాయి. ఆధునిక చికిత్సా పద్దతులు అమలు జరుగుతున్నాయి.
స్ట్రిప్పింగ్: కాళ్ళలో సిరల వాపు వ్యాధి నివారణకు ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ స్ట్రిప్పింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం రోగికి మత్తు మందు ఇచ్చి కాళ్లలో రక్తప్రసరణ నిలిచిపోయిన నరాలను గుర్తించి వాటిని పైనుంచి కింది వరకు కత్తిరించి తొలగించే విధానమే ఈ స్ట్రిప్పింగ్. ఫలితంగా రోగి కొన్ని నెలల పాటు కోలుకోలేని పరిస్ధితులు ఉంటాయి. ఇది రోగికి అత్యంత బాధాకరమేగాక కనీసం 50 శాతం మందికి తిరిగి కొద్ది కాలంలోనే ఈ అనారోగ్యం సంభవించవచ్చు.
లేజర్ ఎబ్లేషన్: కుట్లు, కోతలు, మత్తుమందు, రక్తస్రావం లేని విధంగా కేవలం 30 నిముషాలలో చేసే చికిత్స ఇది. సన్నని వైరుతో స్క్రీన్‌పై కాళ్లలో గూడుకట్టుకున్న రక్తాన్ని గమనిస్తూ వాటిని వేడితో కరిగించే విధానమిది. దీనివలన ఖచ్చితంగా 98 శాతం వరకు వ్యాధి నివారణ జరుగుతుంది.
గ్లూ చికిత్స : ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందుతున్న ఈ గ్లూ చికిత్సలో ప్రత్యేకమైన జిగురును పాడైన సిరలలోకి పంపి వాటిని మూసివేయడం జరుగుతుంది. ఫలితంగా మరో సిర నుంచి రక్త ప్రసరణ యధావిధిగా సాగుతుంది. అత్యంత శిక్షణ పొందిన వైద్యులు మాత్రమే ఈ రకమైన ఖర్చుతో కూడుకున్న గ్లూ చికిత్సను చేయగలరు. దక్షిణ భారతదేశంలో ఏకైక తొలి వాస్క్యులర్ హాస్పిటల్‌గా పేరుగాంచిన ఎవిస్ హాస్పిటల్స్‌లో ఎండీ, లండన్, అమెరికాలలో పనిచేసిన అనుభవశాలి, ప్రఖ్యాత ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ డాక్టర్ రాజా.వి. కొప్పాల ఈ రకమైన చికిత్సలో పేరుగాంచారు. మరిన్ని వివరాలకు 1800 5999977 లేదా 9989527715 నెంబర్లలో సంప్రదించగలరు.