Venu Goapl Reddy
Author- NTV Telugu-
Mexico: మెక్సికోలో కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. మేయర్‌తో సహా 18 మంది మృతి
Gun firing in Mexico.. 18 people died including the mayor: లాటిన్ అమెరికా దేశం మెక్సికో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఇటీవల కాలంలో ఆ దేశంలో కాల్పుల ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దక్షిణ మెక్సికోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాస్ నగరంపై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో మేయర్ తో సహా 18 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికన్ మేయర్ కన్రాడో మెన్డోజా సిటీ హాల్ లో ఉన్న సమయంలో తుపాకులతో విరుచుకుపడ్డారు దుండగులు.… -
Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి కోసం పోటీలో ఉన్న భారతీయులు వీరే..
Pratik Sinha, Mohammed Zubair in the race for the Nobel Peace Prize: ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులు ప్రకటిస్తున్నారు. కాగా..నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 7న ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం శుక్రవారం విడుదల చేసిన అనధికార షార్ట్ లిస్ట్ ప్రకారం భారతదేశం నుంచి ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ వ్యవస్థాపకులు ప్రతీక్ సిన్హా, మహ్మద్ జుబైర్ లో పాటు భారతీయ రచయిత హర్ష్ మందర్ ఈ ఏడాది నోబెల్ శాంతి… -
USA: విషాదం.. కిడ్నాపైన భారత సంతతి కుటుంబం దారుణహత్య
Kidnapped Indian-Origin Family Of 4 Found Dead In US: అమెరికాలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన భారతసంతతి కుటుంబం దారుణంగా హత్యకు గురైంది. ఎనిమిది నెలల పాపతో పాటు మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన స్థానిక భారత సంతతిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిది నెలల అరోహి ధేరి, పాప తల్లిదండ్రులు 27 ఏళ్ల జస్లిన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్, 39 ఏళ్ల మేనమామ అమన్ దీప్ సింగులు ఇటీవల కిడ్నాపుకు గురయ్యారు.… -
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియాగాంధీ.
Sonia Gandhi Joins Bharat jodo Yatra: కాంగ్రెస్ గత వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ‘ భారత్ జోడో యాత్ర’ చేపట్టింది. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందగ బాగానే వస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నిడిచారు. -
North Korea: ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం.. ఆ రెండు దేశాలే కాపాడుతున్నాయన్న యూఎస్ఏ
North Korea Fires 2 Ballistic Missiles: అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు వ్యతిరేకంగా ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. గురువారం మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది నార్త్ కొరియా. మంగళవారం కూడా ఇలాగే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ను జపాన్ మీదుగా ప్రయోగించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తలు పెంచేందుకు నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలు చేపడుతోందని యూఎస్ఏ ఆరోపించింది. -
Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులతో సహా 9 మంది మృతి
Deadly road accident in Kerala - 9 people killed: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాలక్కాడ్ జిల్లా ఇక్కడి వడక్కెంచేరిలో పర్యాటకుల బస్సు, కేరళ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఎర్నాకులంలోని ముళంతురుతిలోని బేసిలియస్ స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు, కేరళ ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఓ కారును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు ప్రమాదానికి గురై వాగులో బోల్తా పడింది. వలయార్ వడక్కంచేరి… -
Anti Hijab Protest In Iran: హిజాబ్ తీసేసి నిరసనల్లో పాల్గొన్న స్కూల్ విద్యార్థినులు..
Anti Hijab Protest In Iran: ఇరాన్ దేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. నాలుగు వారాలుగా అక్కడి యువత, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని హిజాబ్ ధరించలేదని అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే ఆమె మరణించింది. దీంతో అప్పటి నుంచి అక్కడి మహిళలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతున్నారు. -
Gambia: ఆఫ్రికాలో 66 మంది చిన్నారుల మృతి.. భారత ఔషధాలపై దర్యాప్తు
Probing 4 Indian Cough Syrups After 66 Children Die In Gambia: దగ్గు, జలుబు మందు వాడటం వల్ల ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారు. భారతదేశానికి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన నాలుగు దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మరణాలకు సదురు మందులే కారణం అని డబ్యూహెచ్ఓ హెచ్చరించింది. కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశాలకు సరఫరా చేసి ఉండవచ్చని భావిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు… -
Eknath Shinde: నేను “కట్టప్ప”నే కావచ్చు.. కానీ మీలాగ మాత్రం కాదు.. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు
CM eknath shinde comments on uddhav thackeray: దసరా వేడుకలు మహారాష్ట్ర రాజకీయాల్లో కాకపుట్టించాయి. సీఎం ఏక్ నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మధ్య మాటల యుద్ధం చెలరేగింది. శివసేన ఇరు వర్గాల మధ్య విమర్శలు చెలరేగాయి. సీఎం ఏక్ నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. బాల్ థాకరే స్థాపించిన పార్టీ ఎవరి ప్రైవేట్ కంపెనీ కాదని.. అది అందరికి చెందుతుందని అన్నారు. బుధవారం ముంబై జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. శివసేన ఉద్ధవ్ ఠాక్రేది కానది.. శివసేన కోసం… -
West Bengal: దుర్గా నిమజ్జనంలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి
8 Dead, Several Missing During Idol Immersion: విజయదశమి పండగపూట విషాదం నెలకొంది. దుర్గా మాత విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి భక్తులు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మరణించగా.. మరికొంత మంది గల్లంతు అయినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జల్పాయిగురి జిల్లా మల్బజార్ ప్రాంతంలో బుధవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!