Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సందడి చేశారు. లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో జరిగిన ఫైనల్‌ను ముగ్గురూ కలిసి చూసారు. అయితే ఈ సందర్బంగా వారి స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అభిషేక్ శర్మ షేర్ చేసిన ఫొటోల్లో.. ముగ్గురూ వింబుల్డన్ ప్రాంగణంలోని వ్యూయింగ్ టెర్రస్‌పై కలిసి పోజులిచ్చారు. క్రీమ్ కలర్ సూట్లో అభిషేక్ శర్మ, బేజ్ బ్లేజర్లో యువరాజ్ సింగ్, బ్లాక్ సూట్‌కు సన్‌గ్లాసెస్ జోడించి వైభవ్ సూర్యవంశీ కనపడ్డారు. ముఖ్యంగా వైభవ్ స్టైలిష్ లుక్ అభిమానులను తెగ నచ్చేసింది. యువరాజ్ సింగ్ చాలా కాలంగా అభిషేక్ శర్మకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు భారత క్రికెట్లో ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీ కూడా వీరితో కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ప్రపంచ టెన్నిస్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఫైనల్స్‌కు క్రీడా, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. భారత క్రికెటర్ల హాజరుతో ఈ వేడుకకు ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటికే ఈ ఏడాది వింబుల్డన్ సందర్భంగా భారత క్రికెటర్ల సందడి కొనసాగుతోంది. ఇటీవల పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌కు సచిన్ టెండూల్కర్, భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్ఠాత్మక రాయల్ బాక్స్ అతిథులుగా హాజరయ్యారు. ఇప్పుడు అభిషేక్ శర్మ, యువరాజ్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఫైనల్‌ను వీక్షించడంతో వింబుల్డన్‌లో భారత క్రికెట్ తారల సందడి మరింత పెరిగింది.
Love-all at the Centre Court today 💗 @Wimbledon pic.twitter.com/h7kfYxCiLz
— Rajasthan Royals (@rajasthanroyals) July 12, 2026
తాజావార్తలు
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!