Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hema Malini Biopic: బాలీవుడ్లో కొన్ని పేర్లు తరాల మారినా తమ ప్రత్యేక స్థానాన్ని ఎప్పటికీ కోల్పోవు. అలాంటి అరుదైన నటీమణుల్లో హేమ మాలిని ఒకరు. ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో ‘డ్రీమ్ గర్ల్’గా నిలిచిపోయిన ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కారణం కొత్త సినిమా కాదు. తన బయోపిక్ వస్తే, అందులో తన పాత్రను ఎవరు పోషించాలనుకుంటున్నారనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
సినీ పరిశ్రమలో 60 ఏళ్ల విజయవంతమైన సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో నిర్వహించిన ‘డ్రీమ్ గర్ల్స్ డైమండ్ జూబ్లీ’ కార్యక్రమంలో హేమ మాలిని పాల్గొన్నారు. ఈ ప్రత్యేక వేడుకలో ఆమె కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో ఆమె జీవితంపై బయోపిక్ తీసే అవకాశం గురించి కూడా ప్రశ్న ఎదురైంది. ముఖ్యంగా, తన పాత్రను బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోణె పోషిస్తే ఎలా ఉంటుందనే ప్రశ్నకు హేమ మాలిని ఎంతో సానుకూలంగా స్పందించారు. దీపికా పడుకోణె గురించి మాట్లాడుతూ, ఆమెకు ఆసక్తి ఉంటే తప్పకుండా చేయవచ్చు. దీపిక చాలా అందమైన, ప్రతిభావంతమైన నటి అని హేమ మాలిని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క మాటతో తన పాత్రకు దీపికా సరైన ఎంపిక అని పరోక్షంగా వెల్లడించినట్టైంది. అయితే ప్రస్తుతం హేమ మాలిని జీవితంపై బయోపిక్ తెరకెక్కుతున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే ఈ వ్యాఖ్యలపై దీపికా పడుకోణె కూడా ఇప్పటివరకు స్పందించలేదు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
హేమ మాలిని సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘సీతా ఔర్ గీతా’, ‘షోలే’, ‘డ్రీమ్ గర్ల్’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలతో ఆమె భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నటిగా మాత్రమే కాకుండా, రాజకీయాలలో కూడా ఆమె తనదైన ముద్ర వేశారు. అందుకే ఆమె జీవిత కథను బయోపిక్ రూపంలో చూడాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. అలాంటి చిత్రం తెరకెక్కితే భారతీయ సినీ చరిత్రలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆమె జీవితంపై బయోపిక్ తెరకెక్కితే, అందులో నిజంగానే దీపికా పడుకోణె నటిస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదీ లేకపోయినా, డ్రీమ్ గర్ల్ నోటి నుంచి వచ్చిన ఈ కోరిక మాత్రం అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
- Tags
- cinema
- Hema Malini Biopic
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..