2022 Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి మరో కారును ఇండియన్ మార్కెట్ లో గురువారం లాంచ్ చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి ఆల్టో కారు ఒకటి. తాజాగా ఈ రోజు 2022 ఆల్టో కె 10 కారును విడుదల చేశారు. ఎక్స్ షోరూం ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలవుతోంది. కొత్త ఆల్టో కె10 మారుతి సుజుకి ఫిప్త్ జనరేషన్ హార్ట్ టెక్ ప్లాట్ ఫారమ్ పై ఆధారపడి తయారు చేశారు. ఎస్ ప్రెస్సో లోని 1.0 లీటర్ కె-సిరీస్ ఇంజిన్ ను ఆల్టో కె10లో వాడుతున్నారు.
కొత్త ఆల్టో మాన్యవల్, ఆటోమెటిక్ గేర్ బాక్సులతో వస్తోంది. మొత్తం నాలుగు వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. ఇంజిన్, గేర్ బాక్స్ ఆధారంగా వేరియంట్ ధరల్లో తేడాలు కనిపిస్తున్నాయి. స్టాండర్డ్, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్ వేరియంట్లలో ఆల్టో కె10 కారు అందుబాటులోకి రానుంది. మారుతి సెలెరియో డిజైన్ లాగే ఆల్టోను రూపొందించారు. మొత్తం ఆరు కలర్స్ లో ఆల్టో అందుబాటులో ఉంది. సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్ కలర్స్ లో లభిస్తోంది.
Read Also: Munawar Farukhi: మునవార్ ఫరుఖి షో కు అనుమతిస్తే అడ్డుకుంటాం.. బీజేవైఎం వార్నింగ్
ఫీచర్లు ఇవే..
గతంలోని ఆల్టోతో పోలిస్తే పొడవు, వెడల్పులు పెరిగాయి. లెగ్ రూమ్, హెడ్ రూమ్ పెరిగింది. హ్యచ్ బ్యాక్ ఇంటీరియర్ ఆప్టిమైజ్ చేశారు. దీంతో మరింత స్థలం లభిస్తోంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో ఫీచర్లు ఇస్తూ 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో మరియు వాయిస్ కంట్రోల్స్, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నారు. భద్రతలో ఎక్కడా రాజీ పడకుండా.. డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ, ఏబీఎస్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ప్రీ టెన్షనర్ తో కూడిన సీట్ బెల్ట్ మరిన్ని ఫీచర్లను కొత్త ఆల్టో కె 10లో తీసుకువచ్చారు.
2022 ఆల్టోకె 10లో 1.0 లీటర్ త్రి సిలిండర్ కె- సిరీస్ ఇంజిన్ తో వస్తోంది. 65 బీహెచ్పీ పవర్ తో 89 న్యూటన్ మీటర్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యవల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమెటిక్ గేర్ బాక్సును కూడా అందుబాటులోకి తెస్తున్నారు. లీటర్ కి 24.9 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
వేరియంట్ల వారీగా ధరలు..
వేరియంట్ ఆల్టో K10 MT – ఆల్టో K10 AGS
STD రూ. 3.99 లక్షలు –
LXi రూ. 4.82 లక్షలు –
VXi రూ. 4.99 లక్షలు రూ. 5.49 లక్షలు
VXi+ రూ. 5.33 లక్షలు రూ. 5.83 లక్షలు