Venu Goapl Reddy
Author- NTV Telugu-
Rishi Sunak: యూకేకు కాబోయే పీఎం రిషి సునాక్.. ఇండియాతో ఉన్న సంబంధాలు ఇవే….
Rishi Sunak's Indian Connections: భారతదేశాన్ని శతాబ్ధాల పాటు పాలించిన బ్రిటన్ కు తొలిసారి భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని పదవిని చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం యూకే ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఒక్క రిషి సునాక్ మాత్రమే గట్టేక్కించగలడనే అభిప్రాయం అక్కడి ప్రజాప్రతినిధుల్లో ఉంది. దీంతో మెజారిటీ ఎంపీలు రిషి సునాక్ కే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే 170కి పైగా ఎంపీలు మద్దతు తెలిపారు. మరోవైపు సునాక్ ప్రత్యర్థిగా ఉన్న పెన్నీ మోర్డాంట్ కు కేవలం 29 మంది… -
PM Narendra Modi: సరిహద్దులు భద్రంగా.. ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంటేనే దేశం సురక్షితం
PM Narendra Modi celebrates Diwali with army: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, భారత సైనికులతో దీవపాళి వేడుకలను జరుపుకున్నారు. కార్గిల్ సెక్టార్ లో భారత సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతీ దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైనికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యమని సైనికులతో అన్నారు. తమ ప్రభుత్వం యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని ప్రధాని అన్నారు. -
Coimbatore Cylinder Blast : కోయంబత్తూర్ గ్యాస్ సిలిండర్ పేలుడులో ఉగ్ర లింకులు..
Coimbatore Cylinder Blast: తమిళనాడు కోయంబత్తూర్ నగరంలో గ్యాస్ సిలిండర్ పేలుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఉగ్రలింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకు ముందు కారులో గ్యాస్ సిలిండర్ పెట్టడానికి ముబిన్ అనే వ్యక్తి ఇంటి నుంచి సిలిండర్ తీసుకుని వస్తున్న నలుగురు యువకులు వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కోయంబత్తూర్ ఉక్కడంలోని దేవాలయం సమీపంలో ఆదివారం ఎల్పీజీ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే ఈ పేలుడుపై తమిళనాడు పోలీసులు విచారణ… -
Ebola Outbreak: ఉగాండాలో ఎబోలా కల్లోలం.. ఇప్పటి వరకు 40 మరణాలు.
Ebola outbreak in Uganda: ఉగాండాలో ఎబోలా కలకలం రేపుతోంది. ఆ దేశంలో వరసగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాజధాని కంపాలాలో కొత్తగా 9 ఎబోలా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో మొత్తం 14 కేసులు నమోదు అయ్యయాని అక్కడి ఆరోగ్య మంత్రి సోమవారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో సెంట్రల్ ఉగాండాలోని గ్రామీణ ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి ప్రారంభం అయింది. ఈ నెలలో రాజధాని కంపాలాకు ఈ వ్యాధి వ్యాపించింది. 16 లక్షల జనాభా ఉంటే కంపాలాలో వ్యాధి వ్యాపిస్తుండటం… -
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. పిటిషన్ తిరస్కరించిన పాక్ హైకోర్టు.
Imran Khan's plea against politics ban rejected by Pakistan court: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరస షాక్ లు ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే అనేక కేసులు ఇమ్రాన్ ఖాన్ పై నమోదు అయ్యాయి. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టినందుకు అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన… -
Kerala: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం.. సాయంత్రం హైకోర్టు విచారణ..
Governor vs CM in Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా తయారైంది అక్కడి పరిస్థితి. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం వివాదం కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30లోగా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ రాజకీయ దుమారం ఏర్పడింది. ఈ వివాదాస్పద ఆదేశాలను విచారించేందుకు కేరళ హైకోర్టు ఈ… -
Rajiv Gandhi Foundation: సోనియాగాంధీకి బిగ్ షాక్.. రెండు ఎన్జీవోల లైసెన్సులు రద్దు.. సీబీఐ దర్యాప్తుకు ఛాన్స్
Foreign Funding Licence Of Gandhis NGOs Cancelled: గాంధీ కుటుంబానికి చెందిన రెండు ఎన్జీవోలు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)ల ఎఫ్సీఆర్ఏ లైసెన్సులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్సీఆర్ఏ) కింద కేంద్రం ఈ రెండు ఎన్జీవోలపై చర్యలు తీసుకుంది. ఈ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరో కేసులో… -
Uterine cancer: గర్భాశయ క్యాన్సర్లకు కారణం అవుతున్న హెయిర్ స్టైలింగ్ రసాయనాలు..
Chemicals in hair straightening products linked to uterine cancer: మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ కాన్సర్లు ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్లతో పాటు గర్భాశయ క్యాన్సర్లు మహిళల్లో తరుచుగా వస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తుల్లోని రసాయనాలు గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతున్నాయని తేలింది. అమెరికాలో 33,497 మంది మహిళలపై నిర్వహించిన ఆధ్యయనంలో ఈ విషయం తెలిసింది. మనం సౌందర్యానికి, మంచి హెయిర్ స్టైల్ కు వాడే రసాయనాలే క్యాన్సర్… -
Minister Slaps Woman: మహిళను చెంపదెబ్బ కొట్టిన మంత్రి.. వీడియో వైరల్..
Karnataka Minister Slaps Woman: కొంతమంది నేతల దురుసు ప్రవర్తన ఆయా పార్టీలకు చేటు తెస్తున్నాయి. అధికారం తలకెక్కిన నాయకులు ప్రజలతో ఎలా నడుచుకోవాలనేది తెలియడం లేదు. ఆగ్రహంతో ప్రజలను దూషించడం, చేయి చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన మహిళపై చేయి చేసుకున్నారు ఓ మంత్రి. అధికారంలో ఉన్న వ్యక్తి, మంత్రి అయి ఉండీ మహిళ చెంపపై కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో మంత్రి… -
Namaz In Train: ట్రైన్లో నమాజ్.. విచారణకు యోగి సర్కార్ ఆదేశం..
UP Govt investigating Namaz in train: రైలులో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనిపై కొన్ని మంది సానుకూలంగా ఉండగా.. మరికొంత మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి షేర్ చేసిన ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా రైలులో నమాజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై దీప్లాన్ భారతి రైల్వేకు, యూపీ పోలీసులకు ఫిర్యాదు…
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!