Venu Goapl Reddy
Author- NTV Telugu-
Namaz In Train: రైలులో నమాజ్.. వీడియో వైరల్.. రైల్వేకు ఫిర్యాదు
Namaz in train, ex-BJP MLA files complaint with Indian Railways:ఉత్తర్ ప్రదేశ్ లో మరో వివాదం మొదలైంది. ట్రైన్ లో నమాజ్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు ఈ చర్యను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మొత్తం ఘటనను ఉత్తర్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి చిత్రీకరించారు. నలుగురు ముస్లిం వ్యక్తులు రైలులో ప్రయాణికులు నడిచే స్థలంలో నమాజ్ చేయడం ఇందులో కనిపిస్తుంది. -
Yogi Adityanath: ఎన్కౌంటర్లలో 166 మంది నేరస్తులను లేపేశాం..
166 Criminals Killed In Encounters In Last 5 Years, Says Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేరాలకు పాల్పడే వారి ఇళ్లను, ఆస్తులను బుల్డోజర్లతో కూలగొట్టి నేరస్తుల్లో భయాన్ని పుట్టిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వాల హయాంలో యూపీలో పేరుకు పోయిన నేరాలను, మాఫియాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ కౌంటర్లతో నేరస్తులను ఎలిమినేట్ చేస్తోంది యోగి సర్కార్. -
Jharkhand: బైక్ రైడ్‌కు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం..
Physical assault on software engineer in jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన స్నేహితుడితో కలిసి మాట్లాడుతున్న సమయంలో ఓ యువతిని అపహరించి 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ కేసులో 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితులను పట్టుకునేందు పోలీసుదుల దాడులు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని […] -
China: నేటితో ముగియనున్న కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్ పింగ్..!
China's Communist Party Meeting To End Today With Xi Jinping Set For 3rd Term: చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. గత ఆదివారం రోజున రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కీలకమైన 2,300… -
Madhya Pradesh: బిర్యానీతో పార్టీ బలం పెంచుకునేందుకు ఎంఐఎం ప్లాన్..
MIM is giving biryani dinners to increase party strength in madhya pradesh: హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో సత్తా చాటింది. ఈ రాష్ట్రాల్లో ఎంఐఎంకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం ఇతర పార్టీలకు సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది. 2023లో మధ్యప్రదేశ్… -
Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు
Centre Clears Construction Of 6 Corridors In Arunachal Near China Border: భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. భారత్ ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటికే చైనా కొత్త గ్రామాలను, రోడ్డు, ఎయిర్ స్ట్రిప్స్, ఎయిర్ బేసులను నిర్మించింది. గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా తన సైనిక నిర్మాణాలను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే భారత్ కూడా చైనాకు ధీటుగా సరిహద్దుల్లో మౌళిక నిర్మాణాలను చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. ఉద్రిక్తతల సమయంలో… -
Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగం వెళ్తున్న బస్సు, లారీ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మొత్తంగా 15 మంది చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. -
Myanmar: మయన్మార్‌లో సైనిక పాలకుల అరాచకం.. ఉపాధ్యాయుడి తల నరికి పైశాచికం
Myanmar junta beheads high school teacher: మయన్మార్ దేశంలో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సైన్యం అరాచకాలు పెరిగిపోయాయి. మానవహక్కులను ఉల్లంఘిస్తోంది అక్కడి జుంటా ప్రభుత్వం. సైనిక పాలకులకు ఎదురుతిరిగినా.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా.. నిర్ధాక్షిణ్యంగా చంపేస్తోంది. ఇప్పటికే అనేక ఆరోపణపై ప్రముఖ నాయకురాలు ఆంగ్ సాంగ్ సూచీని జైలులో నిర్భంధించింది సైన్యం. తమకు వ్యతిరేకంగా ఉంటే దారుణంగా చంపేస్తోంది. -
Marriage Bill: వివాహ బిల్లును పరిశీలించే పార్లమెంట్ ప్యానెల్ గడువు పొడగింపు
Parliament panel examining Marriage Bill gets another 3 months extension: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బాల్య వివాహాల నిషేధ(సవరణ) బిల్లు 2021ను పరిశీలించే.. విద్యా,మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్థాయి సంఘానికి మరో మూడు నెలల గడువును పొడగించారు. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధంఖర్ పొడగింపును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ వివాహ బిల్లును తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. -
Rishi Sunak: యూకే పీఎం రేసులో రిషి సునాక్.. 100 మంది ఎంపీల మద్దతు..
100 MPs support Rishi Sunak in UK PM race: లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆర్థికంగా కుదేలవుతున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టలేక లిజ్ ట్రస్ చేతులెత్తేశారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేశారు. దీంతో మరోసారి బ్రిటన్ ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. ఇదిలా ఉంటే చాలా మంది టోరీ ఎంపీలు, కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులు రిషి సునక్ ని కాదని లిజ్ ట్రస్ ని ఎన్నుకోవడంపై తప్పు జరిగిందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!