ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Filing: ఆదాయపు పన్ను (ITR) దాఖలు చేసే సీజన్ వచ్చిందంటే చాలా మంది పన్ను చెల్లింపుదారుల ముందుకొచ్చే పెద్ద సందేహం.. పాత ట్యాక్స్ విధానం (Old Tax Regime) ఎంచుకోవాలా? లేక కొత్త ట్యాక్స్ విధానం (New Tax Regime) తీసుకోవాలా? ఈసారి మాత్రం ఎక్కువ మంది ఉద్యోగులకు కొత్త ట్యాక్స్ విధానమే లాభదాయకంగా ఉండొచ్చని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే భారీ మొత్తంలో పన్ను మినహాయింపులు (Deductions) క్లెయిమ్ చేసే వారికి పాత విధానం ఇంకా ప్రయోజనకరంగా ఉండే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కొత్త ట్యాక్స్ విధానమే డిఫాల్ట్‌గా అమల్లో ఉంది. పన్ను చెల్లింపుదారులు ప్రత్యేకంగా పాత విధానాన్ని ఎంపిక చేయకపోతే వారి ఆదాయపు పన్ను రిటర్న్ కొత్త విధానం ప్రకారమే ప్రాసెస్ అవుతుంది. అందువల్ల రిటర్న్ దాఖలు చేసే ముందు రెండు విధానాల్లో పన్ను లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గ్రాంట్ థార్న్టన్ భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి చేసిన విశ్లేషణ ప్రకారం.. 60 ఏళ్లలోపు జీతభత్యాలు తీసుకునే వ్యక్తి పాత విధానంలో సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షలు, సెక్షన్ 80D కింద రూ.25 వేల ఆరోగ్య బీమా, రూ.2 లక్షల HRA, రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపి మొత్తం రూ.4.25 లక్షల డిడక్షన్లు క్లెయిమ్ చేసినా, రూ.25 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను సుమారు రూ.4,52,400 చెల్లించాల్సి ఉంటుంది. అదే కొత్త ట్యాక్స్ విధానంలో రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో పన్ను రూ.3,19,800 మాత్రమే ఉంటుంది. అంటే దాదాపు రూ.1,32,600 వరకు ఆదా అవుతుంది. ఇదే విధంగా రూ.50 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా కొత్త విధానంలో దాదాపు రూ.1.32 లక్షల వరకు పన్ను ఆదా అవుతుందని చెబుతున్నారు. రూ.75 లక్షలు, రూ.1 కోటి ఆదాయం ఉన్నవారికి 10 శాతం సర్‌చార్జ్ వర్తించినప్పటికీ కొత్త ట్యాక్స్ విధానంలో సుమారు రూ.1.46 లక్షల వరకు ఆదా అవుతుందని ఈ నివేదిక పేర్కొంది.
Also Read
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
అయితే పాత ట్యాక్స్ విధానం పూర్తిగా ఉపయోగం లేకుండా పోయిందని భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షల వరకు మినహాయింపు, మెట్రో నగరాల్లో అధిక HRA, 80CCD(1B) కింద NPSలో అదనపు పెట్టుబడులు, సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల ఆరోగ్య బీమాపై అధిక 80D డిడక్షన్లు వంటి ప్రయోజనాలు పొందే వారికి పాత విధానం ఇంకా లాభదాయకంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తం డిడక్షన్లు రూ.8 లక్షలకు పైగా ఉంటే రెండు విధానాలను తప్పనిసరిగా పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. “పాత, కొత్త ట్యాక్స్ విధానాల్లో ఏది ఎంచుకోవాలన్నది అందరికీ ఒకేలా ఉండదు. కొత్త విధానం తక్కువ పన్ను రేట్లు, సులభమైన విధానాన్ని అందిస్తున్నప్పటికీ, ఎక్కువ డిడక్షన్లు, మినహాయింపులు పొందే వారికి పాత విధానం మెరుగైన ఫలితాలు ఇవ్వొచ్చు. కాబట్టి కేవలం పన్ను రేట్లను చూసి కాకుండా, వ్యక్తిగత ఆదాయం, డిడక్షన్లు, మినహాయింపుల ఆధారంగా పన్ను లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి” అని నిపుణులు సూచిస్తున్నారు.
జీతభత్యాలు పొందే ఉద్యోగులకు ప్రతి ఏడాది ట్యాక్స్ విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ TDS కొత్త విధానం ప్రకారం కట్ చేసినా, ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో పాత విధానాన్ని ఎంచుకుని అదనంగా చెల్లించిన పన్నును రీఫండ్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపార లేదా వృత్తి ఆదాయం ఉన్నవారు మాత్రం ట్యాక్స్ విధానం ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిపుణుల సూచన ప్రకారం.. ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఆదాయపు పన్ను శాఖ అందుబాటులో ఉంచిన ట్యాక్స్ కాలిక్యులేటర్ ద్వారా రెండు విధానాల్లో పన్ను లెక్కలు వేసుకోవాలన్నారు. డిడక్షన్లు తక్కువగా ఉంటే కొత్త విధానం ఎక్కువ ప్రయోజనం ఇవ్వొచ్చని, భారీ డిడక్షన్లు ఉంటే రెండు విధానాలను పోల్చి చూసి తమకు ఏది లాభదాయకమో నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?