Venu Goapl Reddy
Author- NTV Telugu-
T20 World Cup: వర్షం తరువాత బంగ్లాదేశ్ భయపడింది.. లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
Sunil Gavaskar's key comments on Bangladesh's defeat: ఆస్ట్రేలియాలో జరుతున్న టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ ను ఇండియా ఓడించింది. బంగ్లా ఓటమిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. బంగ్లా క్రికెటర్లు తమ ఓటమికి సాకులు వెతుకుతూనే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ.. ఫెయిర్ గేమ్ లో ఓడిపోయామంటూ బంగ్లా క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. తొలుత భారత జట్టు 184-6 రన్స్ చేసింది. అయితే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్ -
Tamil Nadu Rains: దంచికొడుతున్న వర్షాలు.. చెన్నైతో పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Tamil Nadu Rains: తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరంతో పాటు పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. పలు చోట్ల సబ్ వేలను మూసేశారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా చెన్నై, పుదుచ్చేరిలో సెలవులు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. పుదుచ్చేరిలో రెండు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్లు విద్యాశాక మంత్రి ఓం… -
Covid 19: సుదీర్ఘకాలం కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత కోలుకున్న వ్యక్తి
UK Researchers Cure Man Who Had Covid For 411 Days: రెండున్నరేళ్ల నుంచి ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతోంది. అనేక దేశాలు వ్యాక్సిన్లను తయారు చేసినా కూడా తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టానా.. ముప్పు మాత్రం ఇంకా తప్పిపోలేదు. కరోనా వల్ల చాలా కుటుంబాలు, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర… -
Total Lunar Eclipse 2022: ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం.. “బ్లడ్ మూన్”గా దర్శనం ఇవ్వనున్న చంద్రుడు
Total Lunar Eclipse 2022: వరసగా కొన్ని వారాల వ్యవధిలో రెండు ఖగోళ అద్భుతాలు దర్శనం ఇస్తున్నాయి. గత నెల చివరి వారంలో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడగా.. నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. భూమి ఛాయలోకి చంద్రులు రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సారి గ్రహణ సమయంలో చంద్రుడు నెత్తురు రంగులో ‘బ్లడ్ మూన్’గా దర్శనం ఇవ్వనున్నాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై రావడంతో కొంత సమయం పాటు చంద్రుడు… -
India at UNSC: రష్యాకు షాక్.. ఉక్రెయిన్‌పై తీర్మానానికి భారత్ దూరం..
India Abstains On Russian-Sponsored Resolution Against Ukraine At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ పై రష్యా ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. అమెరికా, ఉక్రెయిన్ ల్యాబుల్లో ‘సైనిక జీవసంబంధ కార్యకలాపాలు’ జరుగుతున్నాయని రష్యా ఆరోపిస్తూ.. ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ముందుకు తీసుకువచ్చింది. దీన్ని పరిశోధించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని రష్యా కోరింది. జీవ ఆయుధాల ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని రష్యా ఆరోపించింది -
PM Narendra Modi: “మజెల్ తోవ్ మై ఫ్రెండ్”.. బెంజమిన్ నెతన్యాహూకు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
PM Modi Congratulates Israel's Netanyahu: ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఇజ్రాయిల్ పార్లమెంట్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి యాయిర్ లాపిడ్ తన పరాజయాన్ని అంగీకరించారు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత నెతన్యాహుకు అభినందనలు తెలిపారు. 99 శాతం ఓట్ల లెక్కింపు తర్వాత నెతన్యాహు పార్టీ 120 సీట్లకు గానూ 64 సీట్లను కైవసం… -
Coimbatore Blast Case: కోయంబత్తూర్ పేలుడులో “జిహాద్” కోణాలు.. నిందితుడి ఇంట్లో కీలక విషయాలు
Jihad literature recovered from Coimbatore car bomb accused home: తమిళనాడులో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఉగ్రకోణం ఉన్నట్లు ఇప్పటికే తమిళనాడు పోలీసులు గుర్తించారు. తాజాగా నిందితుడి ఇంట్లో కీలక విషయాలను గుర్తించారు. అక్టోబర్ 23న కోయంబత్తూర్ కారు పేలుడుతో మరణించిన నిందితుడు జమేషా ముబీన్ ఇంటి నుంచి జీహాద్ కు సంబంధించిన పత్రాలను, చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
Australia: ఇండియన్ వ్యక్తిపై రూ.5 కోట్ల రివార్డ్ ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఎందుకో తెలుసా..?
Australian police have offered a reward of Rs 5 crore for an Indian man in a beach murder case: భారతీయ వ్యక్తిపై ఆస్ట్రేలియన్ పోలీసులు ఏకంగా ఒక మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ.5 కోట్ల భారీ రివార్డు ఇది. నాలుగేళ్ల క్రితం 2018లో ఆస్ట్రేలియన్ బీచ్ లో ఓ హత్య చేసిన తర్వాత పారిపోయిన భారతీయ వ్యక్తి కోసం ఆస్ట్రేలియా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. -
Apple: ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్పటి నుంచి ఐ ఫోన్లలో 5జీ సేవలు
Apple Users In India To Get 5G From Next Week: భారతదేశంలోని ఆపిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 5 జీ సేవల గురించి క్లారిటీ ఇచ్చింది. 5 జీ నెట్ వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను వచ్చే వారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ తన ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్వేర్ అప్డేట్ను అందుబాటులోకి తెస్తోంది. -
Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!