Gaganyaan Expected to Launch in 2024: భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష యాత్రను ‘‘ గగన్ యాన్’’ పేరుతో చేపట్టనుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే.. 2024లో భారత మొదటి అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా ఈ గగన్ యాన్ మిషన్ కు సంబంధించిన షెడ్యూల్ ఆలస్యం అయింది. 2021లో ఈ ఏడాది గగన్ యాన్ చేపడుతామని ఇస్రో ప్రకటించినప్పటికీ.. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ మిషన్ ఆలస్యం అవుతూ వచ్చింది. 2024లో గగన్ యాన్ మిషన్ ఉంటుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల వెల్లడించారు.
గగన్ యాన్ కోసం ఇస్రో టెస్ట్ ప్లైట్ చేపట్టనుంది. దీని కోసం స్పేస్ ఫేరింగ్ హ్యూమనాయిడ్ రోబోను ఉపయోగించనున్నారు. ఈ హ్యూమనాయిడ్ రోబోకు ‘ వ్యోమ్ మిత్ర’ అని పేరు పెట్టారు. టెస్ట్ ప్లైట్ కోసం దీన్ని బాహ్య అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. గగన్ యాన్ కోసం.. ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన నలుగురు ఫైటర్ పైలెట్లను గుర్తించింది. రష్యా వీరికి శిక్షణ ఇస్తోంది. జీరో గ్రావిటీ, స్పేస్ వాతావరణాన్ని తట్టుకునేలా ఈ నలుగురు శిక్షణ తీసుకుంటున్నారు.
Read Also: Teacher Video:క్లాస్ రూమ్ లో టీచర్ కు ముద్దుపెట్టిన స్టూడెంట్.. ఇంకా పెట్టు అన్న పంతులమ్మ
ఇస్రో ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలు మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టాయి. ప్రస్తుతం భారత్ తన మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టబోతోంది. దీంతో ఈ ప్రయోగాన్ని చేపట్టిన అతికొన్ని దేశాల సరసన భారత్ నిలుస్తుంది. అంతరిక్ష నౌకను భూమి నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగించి అక్కడ నుంచి పారాచూట్లను ఉపయోగించి క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి ప్రయోగం చేస్తున్నారు. గగన్ యాన్ ట్రాక్ చేయడానికి రిలే ఉపగ్రహాలను వినియోగించనుంది.