Sun Colour Is Actually White: మన సౌరవ్యవస్థకు మూలాధారం సూర్యుడు. మన గ్రహాలకు కావాల్సిన శక్తిని ఇస్తుంటాడు. అయితే సూర్యుడు మనకు ఎప్పుడు పసుపు రంగులోనే దర్శనం ఇస్తుంటాడు. అయితే అసలు సూర్యుడి కలర్ పసుపు రంగు కానది మాజీ నాసా వ్యోమగామి స్కాల్ కెల్లీ అంటున్నారు. సూర్యుడు తెలుపు రంగులో ఉంటాడని ధ్రువీకరించారు ఆయన. విశ్వంలో అనేక నక్షత్రాలతో పోల్చుకుంటే సూర్యుడు ఓ మరగుజ్జు నక్షత్రం. సూర్యుడితో పోలిస్తే కొన్ని వేల రెట్లు పెద్దవైన నక్షత్రాలు మన పాలపుంతతో పాటు ఇతర గెలాక్సీల్లో ఉన్నాయి.
అసలు సూర్యుడు పసుపు రంగులో కాకుండా.. ‘తెలుపు రంగు’లో ఉంటాడని స్కాల్ కెల్లీ చెబుతున్నాడు. అయితే ఇది అంతరిక్షం నుంచి చూసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని ఆయన వెల్లడించారు. భూమిపై ఉన్న వాతావరణం కారణంగా సూర్యుడి కాంతి మనకు పసుపు రంగులో కనిపిస్తాడు. ఒక వేళ భూ వాతావరణం నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఎల్లో కలర్ లో కాకుండా తెల్లగా కనిపిస్తాడు.
Read Also: Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హెచ్చరిక.. అలా చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం..!!
సూర్యరశ్మి మన కళ్లను చేరినప్పుడు కళ్లలోని ఫోటోరిసెప్టర్ కణాలు వీటిని గ్రహిస్తాయి. దీని వలన అన్ని రంగులు కలిసిపోతాయి. దీంతో మనం సూర్యుడి అసలు రంగును గ్రహించలేము. భూమిపై ఉండే వాతావరణం సూర్యుడి రంగుపై ప్రభావం చూపిస్తుంది. తక్కువ తరంగధైర్ఘ్యం ఉన్న నీలి రంగు వాతావరణం నుంచి ప్రయాణించినప్పుడు వాతావరణం ద్వారా శోషించబడుతుంది. వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్లో ఉండే ఓజోన్ లేయర్ యూవీ, గామా కిరణాలు భూమిపై రాకముందే శోషించుకుంటుంది. ఇన్ఫ్రారెడ్ కిరణాలను కూడా వాతావరణంలోని నీటి ఆవిరి గ్రహిస్తుంది. దీంతో సూర్యుడి అసలు కాంతిని వాతావరణం ఫిల్టర్ చేస్తుంది. మన మెదడు కూడా తక్కువ నీలం-పసుపుతో ఉన్న రంగులను మాత్రమే కళ్లు గ్రహించేలా చేస్తుంది. దీంతో సూర్యుడి అసలు కాంతిని మనం గ్రహించలేమని నాసా వివరించింది.