Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలతో వస్తోంది. ఇప్పుడు ఆ అంచనాలకు మరింత హైప్ తెచ్చేలా మరో ఘనతను ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రముఖ మూవీ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ IMDb విడుదల చేసిన తాజా జాబితాలో ‘టాక్సిక్’ ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీగా మొదటి స్థానంలో నిలవడం విశేషంగా మారింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి నుంచే భారీ అంచనాలతో నిలుస్తోంది. యష్‌ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించనున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడినప్పటికీ ప్రేక్షకుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా విడుదలైన ‘లేడీస్ అండ్ లేడీస్’ టీజర్‌తో పాటు ‘తబాహి’ పాటకు వచ్చిన అద్భుత స్పందన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సోషల్ మీడియాలో ఈ ప్రమోషనల్ కంటెంట్‌కు వచ్చిన స్పందన కూడా సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
ఇప్పుడు IMDb తాజా ర్యాంకింగ్స్‌లో ‘టాక్సిక్’ అగ్రస్థానంలో నిలవడం చిత్రబృందానికి మరో పెద్ద ఊరటనిచ్చింది. ఈ జాబితా సెర్చ్ ట్రెండ్స్ వంటి అంశాల ఆధారంగా రూపొందుతుండటంతో, విడుదలకు ముందే ఈ స్థాయి గుర్తింపు రావడం విశేషంగా భావిస్తున్నారు. దీంతో ఆగస్టు 26 విడుదలకు ముందు సినిమాపై బజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యష్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ క్యాస్టింగ్, గీతూ మోహన్ దాస్ ప్రత్యేక మేకింగ్ శైలి కలిసి ‘టాక్సిక్’ను ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
-
Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!