ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మదర్సాల్లో జాతీయగీతం ‘ జన గణ మన’ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గురువారం నుంచి యూపీలోని అన్ని మదర్సాల్లో అమలు చేస్తోంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ మార్చి 24న జరిగిన సమావేశంలో అన్ని మదర్సాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈరోజు నుంచి అన్ని మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పని సరి చేసింది. విద్యార్థులు […]
కర్ణాటక ప్రభుత్వం వివాదాస్పద మతమార్పిడి నిరోధక బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మత మార్పిడి నిరోధక బిల్లుపై ఈ రోజు సీఎం బస్వరాజ్ బొమ్మై కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ బిల్లుపై ఆర్డినెన్స్ తెస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, మండలి ప్రొరోగ్ కావడంతో బొమ్మై సర్కార్ ఈ ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లును 2021 డిసెంబర్ లో కర్ణాటక శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండటంతో […]
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటోంది. ఇన్నాళ్లు శాంతియుతంగా సాగిన నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ప్రజలు అధ్యక్షడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని పదవిలో ఉన్న మహిందా రాజపక్సేలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు మహిందా రాజపక్సే. భద్రతా కారణాల వల్ల ఆర్మీ ఆయన్ను సేఫ్ ప్లేస్ కు తరలించింది. తాజాగా దేశం విడిచి వెళ్లకుండా శ్రీలంక కోర్ట్ నిషేధం విధించింది. […]
శ్రీలంక దేశం రావణకాష్టంగా మారింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం అల్లాడుతోంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు ఘోరంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా ఆ దేశంలో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే తాజాగా ఈ ఘటనలు హింసాత్మకంగా మారాయి. పలువురు మరణించడంతో పాటు 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో ప్రధాని […]
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గా క్యాప్ బెల్ విల్సన్ ను నియమిస్తూ టాటా సన్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమ్మివేసిన సంగతి తెలిసిందే. టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లతో కొనుగోలు చేసింది. గతేడాది అక్టోబర్ లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకోగా… ఈ ఏడాది జనవరి నుంచి టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే ముందుగా ఎయిర్ […]
దేశంలో ప్రముఖంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి హైకోర్ట్ లో విచారణ జరిగింది. జ్ఞానవాపి మసీదు సర్వేపై కోర్ట్ విచారణ జరిపింది. సర్వే చేయాలని కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించింది. కమిషన్ మే 17 లోగా నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఇటు హిందువులు, అటు ముస్లింల తరుపున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. […]
రాజద్రోహం చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్ట్ స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజద్రోహ చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ పున: సమీక్షించే వరకు రాజద్రోహం కింద కేసులు నమోదు చేయవద్దని కేంద్ర , రాష్ట్రాలను ఆదేశించింది. రాజద్రోహ చట్టం 124ఏ కింద ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ కేసు కింద శిక్ష అనుభవిస్తున్న వారు బెయిల్ […]
వరుస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి విజయం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. చివరకు తాము అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా అంతర్గత కలహాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పింది. ఇక ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పెర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అంత ఘోరంగా పార్టీ అపజయాలను […]
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ఎత్తేసిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. ఎప్పటికప్పుడు లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నా… భద్రతా బలగాలు వరసగా ఎన్ కౌంటర్లు చేసి ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి. సరిహద్దుల వెంబడి పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. భద్రతా బలగాలు సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతో చాలా వరకు […]
‘స్విగ్గీ’ గురించి ప్రత్యేకం పరిచయం చేయాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఫుడ్ డెలవరీలతో చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం మెట్రోసిటీల్లో బిజీ లైఫ్ కారణంగా హోటళ్లు వెళ్లి తినే అలవాటును తగ్గించుకుంటున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలవరీ ప్లాట్ ఫారాలను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఆర్డర్లు చేసిన తక్కువ సమయంలో నేరుగా ఫుడ్ ను ఇళ్లు తీసుకువస్తున్నారు. దీంతో స్విగ్గీ సంస్థకు ఆదాయం బాగానే వస్తోంది. ఇదిలా ఉంటే స్విగ్గీ ఇన్నాళ్లుగా నిర్వహిస్తున్న […]