చాలా తక్కువ బడ్జెట్‌తో ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన C సిరీస్‌లో భాగంగా పోకో C85 5G అనే కొత్త మొబైల్‌ను తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే అనేక కంపెనీలు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో.. పోకో చాలా తక్కువ ధరలో 5G నెట్ వర్క్ తో అందుబాటులోకి వచ్చేసింది..
పోకో C85 5G ఫోన్ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తోంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందిస్తుంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మన ముందుకు వస్తుంది. ఈ ఫోన్‌లో 6000mAh సామర్థ్యమైన బ్యాటరీ ఉండడంతో.. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ప్ పై పనిచేస్తుంది.
అయితే..పోకో C85 5G మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,500గా నిర్ణయించింది మేనెజ్మెంట్. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.13,500గా ఉంది. ఇక 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను దాదాపు రూ.15,000 ధరకు విక్రయించనున్నారు. అదనంగా, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది పోకో సిబ్బంది వెల్లడించింది.ఈ పోకో C85 5G స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 15వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.