ANCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన Toyota Hilux
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toyota Hilux ANCAP 5 Star: ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన పికప్ ట్రక్‌గా పేరుగాంచిన టయోటా హైలక్స్ మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈసారి భద్రత విషయంలో మంచి గుర్తింపును సాధించింది. 2025 టయోటా హైలక్స్ కి ANCAP (ఆస్ట్రేలియా న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నుంచి పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. హైలక్స్‌పై చేసిన ANCAP పరీక్షలు ప్రమాదాల సమయంలో రక్షణతో పాటు, ప్రమాదం జరగకుండా చేసే సిస్టమ్‌ల పనితీరును కూడా పరిశీలించాయి. పెద్దల భద్రతలో హైలక్స్ 40కి గాను 33.96 పాయింట్లు(84 శాతం రేటింగ్) సాధించింది. ముందు నుంచి, పక్కల నుంచి, పోలుకు ఢీ కొన్నప్పుడు కారు భద్రతను పరిశీలించారు. విప్లాష్ రక్షణ వంటి అనేక పరీక్షల్లో ట్రక్ బలమైన బాడీ నిర్మాణం, సమర్థవంతమైన సీట్‌బెల్ట్ సిస్టమ్‌లతో మంచి ఫలితాలు సాధించింది. పిల్లల భద్రతలో హైలక్స్ మరింత ఆకట్టుకుంది. మొత్తం 49 పాయింట్లలో 44 పాయింట్లు సాధించి 89 శాతం స్కోర్ పొందింది. మెరుగైన సీట్ డిజైన్, బలమైన ISOFIX యాంకరేజ్ వల్ల చిన్నపిల్లలకు మరింత భద్రత కల్పిస్తున్నట్టు స్పష్టమైంది.
READ MORE: చాలా తక్కువ బడ్జెట్ తో ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న పోకో C85 5G..
Also Read
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
రోడ్డుపై నడిచేవాళ్లు, సైకిల్ తొక్కేవాళ్ల భద్రత విషయంలో హైలక్స్ మంచి ఫలితాలు సాధించింది. ఈ విభాగంలో 82 శాతం స్కోర్ వచ్చింది. పాదచారులు, సైక్లిస్టులు, బైక్‌పై వెళ్లేవాళ్లను గుర్తించి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్‌గా బ్రేక్ వేయగల సిస్టమ్‌లు ఇందులో కీలక పాత్ర పోషించాయి. డ్రైవర్‌కు సహాయం చేసే సేఫ్టీ సిస్టమ్‌ల విభాగంలోనూ హైలక్స్ 82 శాతం స్కోర్ సాధించింది. సీట్‌బెల్ట్ అలర్ట్‌లు, లేన్ సపోర్ట్, స్పీడ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్, ముందు నుంచి లేదా మలుపుల్లో జరిగే ప్రమాదాలను నివారించే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లను ANCAP పరిశీలించింది. ఇవన్నీ కలిసి ప్రమాదం జరగకుండా ముందే అడ్డుకునేలా పనిచేస్తాయి.
READ MORE: The Raja Saab : నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!